మాచో హీరో మూవీకి క్లాప్ కొట్టిన వినాయ‌క్

Sun,November 19, 2017 12:57 PM
gopi chand 25 movie launched today

ఒకప్పుడు విల‌న్ గా అల‌రించిన గోపిచంద్ కాస్త టర్న్ తీసుకొని హీరోగా మారాడు. కుటుంబ కథా చిత్రాలలో నటిస్తూ అందరి అభిమానాన్ని దక్కించుకుంటున్నాడు. లౌక్యం, జిల్ వంటి సూపర్ హిట్ చిత్రాలతో అలరించిన గోపిచంద్ ఆ తర్వాత సౌఖ్యం తో బోల్తా పడ్డాడు. ఈ మ‌ధ్య ఆర‌డుగుల బుల్లెట్, గౌత‌మ్ నంద చిత్రాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఇక జ్యోతి కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో గోపిచంద్ న‌టించిన‌ ఆక్సీజ‌న్ మూవీ డిసెంబ‌ర్ 29న విడుద‌ల కానుంది. క‌ట్ చేస్తే మాచో హీరో గోపిచంద్ 25వ సినిమా తాజాగా రామానాయుడు స్టూడియోలో పూజా కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంది. వివి వినాయ‌క్ క్లాప్ హొట్టి షూటింగ్ ప్రారంభించారు. ఈ చిత్రానికి కె. చ‌క్ర‌వ‌ర్తి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నుండ‌గా, కెకె రాధామోహ‌న్ నిర్మాణంలో ఈ మూవీ రూపొంద‌నుంది. మెహ‌రీన్ ఇందులో క‌థానాయిక‌గా న‌టిస్తుంది. గోపి సుంద‌ర్ ఈ చిత్రాన‌కి సంగీతం అందిచ‌నున్నాడు.1207
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles