మ‌ధుబాల‌కి గూగుల్ డూడుల్ నివాళి

Thu,February 14, 2019 06:56 AM
Google Celebrates Madhubala 86th Birthday

ప్రముఖ ఇంట‌ర్నెట్ సర్చ్ ఇంజిన్ గూగుల్ సంస్థ‌ ఈ రోజు మ‌ధుబాల జయంతి సంద‌ర్భంగా ఆమెకి నివాళులు అర్పిస్తూ డూడుల్‌లో ఆమె ఫోటో ఉంచింది. 1933 ఫిబ్ర‌వ‌రి 14న జ‌న్మించిన మ‌ధుబాల 1969 ఫిబ్ర‌వ‌రి 23న క‌న్నుమూశారు. కెరియ‌ర్‌లో 70కి పైగా సినిమాల‌లో న‌టించిన ఆమె ప్రేక్ష‌కుల గుండెల‌లో చెర‌గని ముద్ర వేసుకుంది. 9 ఏళ్ళ వ‌య‌స్సులో మ‌ధుబాల వెండితెర‌కి ప‌రిచ‌యం కాగా, ఆ త‌ర్వాత 14 ఏళ్ళ వ‌య‌స్సులో నీల్ క‌మ‌ల్ అనే చిత్రంలో లీడ్ రోల్ పోషించింది. ఈ చిత్రం ఆమెకి పేరు ప్ర‌ఖ్యాత‌లు తెచ్చిపెట్టింది.

1949లో వ‌చ్చిన బోంబే టాకీస్ చిత్రం మహల్‌లో ప్రధాన పాత్రను పోషించిన తరువాత, మధుబాల అత్యంత ప్రజాదరణ పొందారు. ఆ సమయంలో ఆమె వయసు 16 సంవత్సరాలే అయినప్పటికీ, ఆమె సున్నిత మరియు నైపుణ్యంతో కూడిన నటన అశోక్ కుమార్‌ను ఎంత‌గానో ఆకర్షించింది. రొమాంటిక్‌, కామెడీ, డ్రామ్ ఇలా ఎన్నో పాత్ర‌ల‌లో న‌టించి మెప్పించింది మ‌ధుబాల‌. మొఘ‌ల్ ఈ అజ‌మ్ అనే చారిత్రాత్మ‌క చిత్రం మ‌ధుబాల కెరీర్‌లో గొప్ప చిత్రంగా చెప్ప‌వ‌చ్చు.

ప్ర‌ముఖ న‌టుడు దిలీప్ కుమార్‌తో మ‌ధుబాల‌కి ప్రేమాయ‌ణం న‌డిచింద‌ని అప్ప‌ట్లో ఎన్నో పుకార్లు షికారు చేశాయి. వెండితెర‌పై వీరిద్ద‌రి కెమిస్ట్రీ ప్రేక్ష‌కుల మ‌న‌సుల‌ని కొల్ల‌గొట్టేది. అయితే 1950లో ఆమెకి గుండెలో రంధ్రం ఉన్న‌ట్టుగా గుర్తించారు వైద్యులు. అప్ప‌టి కాలంలో గుండె శస్త్రచికిత్స అందుబాటులో లేక‌పోవ‌డంతో 36 ఏళ్ళ వ‌య‌స్సులోనే క‌న్నుమూశారు. హాలీవుడ్‌లోను న‌టించాల‌ని మ‌ధుబాల ఎన్నో క‌ల‌లు క‌నేది. ఆమె భౌతికంగా మ‌న మ‌ధ్య లేక‌పోయిన సినిమాల ద్వారా ఇప్ప‌టికి అల‌రిస్తూనే ఉన్నారు.

మ‌ధుబాల అస‌లు పేరు ముంతాజ్ జహాన్ బేగం దేహ్లావి కాగా, నటీమణి దేవికా రాణి ఆమె నటనకు మరియు సామర్ధ్యానికి ముగ్దులై మధుబాల అనే పేరు పెట్టుకోమని సలహా ఇచ్చారు . ఈ నేప‌థ్యంలోనే ముంతాజ్ మ‌ధుబాల‌గా మారింది. ముంతాజ్ యొక్క మొదటి చిత్రం బసంత్ (1942) బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతమైంది. ఆమె దానిలో ప్రసిద్ధ నటి ముంతాజ్ శాంతి యొక్క కుమార్తెగా నటించారు.

1476
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles