గూఢ‌చారికి ప్యాక‌ప్ చెప్పిన బాహుబ‌లి న‌టుడు

Fri,June 15, 2018 11:22 AM

కర్మ మూవీతో యాక్టింగ్ కెరీర్‌ని స్టార్ చేసి, పవన్ కళ్యాణ్ పంజా చిత్రంతో అభిమానుల మనసులు గెలుచుకున్న నటుడు అడవి శేషు. దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి చిత్రంలో భద్ర అనే క్యారెక్టర్‌లో కనిపించి ఫుల్ ఫేమస్ అయ్యాడు. క్షణం సినిమాతో నటుడిగా, రచయితగా అందరి దృష్టిలో పడ్డాడు. ఇక ఇప్పుడు అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌లో గూడాచారి అనే చిత్రాన్ని చేశాడు. తాజాగా ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇదే విష‌యాన్ని అడ‌వి శేష్ త‌న ట్విట్టర్ ద్వారా తెలియ‌జేస్తూ కొద్ది సేపట్లో మేజ‌ర్ ఎనౌన్స్‌మెంట్ రానుంద‌ని పేర్కొన్నాడు. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని శశి కిరణ్ తెర‌కెక్కించారు. మోడ‌ల్‌ శోభిత దులిపాల ఈ చిత్రంతో కథానాయికగా ప‌రిచ‌యం అవుతుంది. ఈ చిత్రంలో అడివి శేషు పాత్ర చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందట. ఈ సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకోవాలని భావిస్తున్నాడు యంగ్ హీరో. ఇండియాలోని ప‌లు ప్రాంతాల‌తో పాటు బంగ్లాదేశ్‌, యూఎస్‌లో షూటింగ్ జ‌రుపుకున్న ఈ చిత్రంలో సుప్రియ యార్ల‌గ‌డ్డ కీ రోల్ పోషించింది. ఇదిలా ఉండ‌గా వెంక‌ట్ కుంచ తెర‌కెక్కిస్తున్న 2 స్టేట్స్ రీమేక్ కూడా చేస్తున్నాడు అడ‌వి శేష్‌. ఇందులో రాజ‌శేఖ‌ర్ త‌న‌య శివాని క‌థానాయిక‌గా న‌టిస్తుంది.2322
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles