ఆగస్ట్ 3న రాబోతున్న 'గూడఛారి'

Fri,June 15, 2018 04:08 PM
Goodachari movie releaswe date fixed

‘దొంగాట’, ‘క్షణం’, ‘అమీతుమీ’ లాంటి విభిన్నమైన సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు అడివి శేష్. రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి చిత్రంలో భద్ర అనే క్యారెక్టర్లో కనిపించి ఫుల్ ఫేమస్ అయ్యాడు. క్షణం సినిమాతో నటుడిగా, రచయితగా అందరి దృష్టిలో పడ్డాడు . ఇప్పుడు అడివి శేష్ హీరోగా మరో సినిమా వస్తోంది. అదే ‘గూఢచారి’. శోభిత ధూలిపాళ్ల హీరోయిన్. ప్రకాష్‌రాజ్ కీలకపాత్ర పోషించారు. ఈ సినిమా ద్వారా శశికిరణ్ తిక్కా దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

అభిషేక్ పిక్చర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, విస్టా డ్రీమ్స్ మర్చంట్ బ్యానర్లపై అభిషేక్ నామా, టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నఈ సినిమా షూటింగ్ రీసెంట్ గా పూర్తి కాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఆగష్టు 3న చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. సినిమా చిత్రీకరణ అధిక భాగం అమెరికా, హిమాచల్ ప్రదేశ్, పుణే, న్యూ ఢిల్లీ, చిట్టగాంగ్, హైదరాబాద్, వైజాగ్‌ల్లో జరిగింది. సుప్రియ యార్లగడ్డ ఈ సినిమాతో వెండితెరపై రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. వెన్నెల కిషోర్, అనిష్ కురివెళ్ల, రాకేష్ వర్రీ తదితరులు నటిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల స్వరాలు సమకూర్చగా.. శనీల్ డియో సినిమాటోగ్రఫీ అందించారు.

1496
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles