గూఢచారి సినిమాకి దక్కిన అరుదైన గౌరవం

Sat,August 4, 2018 04:36 PM
goodachari gets high rating

కర్మ మూవీతో యాక్టింగ్ కెరీర్ని స్టార్ చేసి, పవన్ కళ్యాణ్ పంజా చిత్రంతో అభిమానుల మనసులు గెలుచుకున్న నటుడు అడవి శేషు. దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి చిత్రంలో భద్ర అనే క్యారెక్టర్లో కనిపించి ఫుల్ ఫేమస్ అయ్యాడు. ఆయన నటించిన తాజా చిత్రం ‘గూఢచారి’. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ లో రూపొందిన ఈ చిత్రంలో శోభిత ధూలిపాళ్ల హీరోయిన్. ప్రకాష్రాజ్ కీలకపాత్ర పోషించారు. ఈ సినిమా ద్వారా శశికిరణ్ తిక్కా దర్శకుడిగా పరిచయమయ్యారు. ఈ శుక్రవారం విడుదలైన గూఢచారి చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు బాక్సాఫీస్ దగ్గర వసూళ్ళ ప్రభంజనం సృష్టిస్తుంది.

స్పై థ్రిల్లర్ గా తెరకెక్కిన గూఢచారి సినిమాకి ప్రముఖ ఇంటర్నెట్ డేటా బేస్ (ఐఎండిబి) సంస్థ పదికి 9.1 రేటింగ్ ఇచ్చింది. గతంలో అతి కొద్ది సినిమాలకి మాత్రమే ఆ సంస్థ ఇలా రేటింగ్ ఇచ్చింది. రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించిన చి.ల.సౌ సినిమాకి 9 రేటింగ్ ఇచ్చారు ఐఎండిబి. మంచి ఘనత సాధించిన ఈ సినిమాలు రానున్న రోజులలో బాక్సాఫీస్ దగ్గర మరిన్ని వసూళ్ళు రాబట్టడం ఖాయంగా కనిపిస్తుంది. సుప్రియ యార్లగడ్డ ఈ సినిమాతో వెండితెరపై రీ ఎంట్రీ ఇచ్చారు. వెన్నెల కిషోర్, అనిష్ కురివెళ్ల, రాకేష్ వర్రీ తదితరులు ముఖ్య పాత్రలలో నటించారు . శ్రీచరణ్ పాకాల స్వరాలు సమకూర్చగా.. శనీల్ డియో సినిమాటోగ్రఫీ అందించారు.

3383
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles