సోనాలి ఆరోగ్య ప‌రిస్థితిపై ట్వీట్ చేసిన ఆమె భ‌ర్త

Fri,August 3, 2018 11:16 AM
Goldie Behl responds on sonali health

ప్ర‌ముఖ‌ భారతీయ సినీ నటి, మోడల్ సోనాలి బింద్రే హైగ్రేడ్ క్యాన్స‌ర్‌తో బాధ‌ప‌డుతున్న‌ట్టు కొన్ని రోజుల ముందు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఆమెకి క్యాన్సర్ సోకిందనే విషయం తెలుసుకున్న అభిమానుల గుండె ఒక్కసారిగా ఆగినంత పనైంది. ఈ వార్తని జీర్ణించుకోవడం కష్టతరమైంది. ప్రస్తుతం న్యూయార్క్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్న సోనాలి కీమో థెరపీ నిమిత్తం తన జుట్టుని కూడా కత్తిరించుకుంది. అందుకు సంబంధించి ఇటీవల కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే ఆమెకి సోకిన వ్యాధి 4వ ద‌శ‌లో ఉంద‌ని వార్త‌లు రాగా, అభిమానుల‌లో తీవ్ర ఆందోళ‌న నెల‌కొంది.

ఎప్ప‌టిక‌ప్పుడు సోనాలి ఆరోగ్య ప‌రిస్థితి గురించి అప్‌డేట్స్ ఇస్తూ ఉండే కుటుంబ స‌భ్యులు మ‌రో అప్ డేట్ ఇచ్చారు. సోనాలి భ‌ర్త గోల్డీ బెల్ త‌న ట్వీట్ ద్వారా ఆమె ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉంద‌ని చెప్పారు. సోనాలిపై మీరు చూపిస్తున్న ప్రేమ‌, స‌పోర్ట్‌కి ధ‌న్య‌వాదాలు . ఎలాంటి ఇబ్బందిలేకుండా ట్రీట్‌మెంట్ తీసుకుంటోంది. ఇది చాలా లాంగ్ జర్నీ మేం దీన్ని పాజిటివ్‌గా తీసుకొని ముందుకు వెళుతున్నాము అని తెలిపారు. ఎక్కువగా హిందీ సినిమాల్లో నటించిన సోనాలి మరాఠీతో పాటు, దక్షిణభారతదేశంలో తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లో కూడా నటించింది. ఆమె నటించే సమయంలో అత్యంత అందమైన హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది సోనాలి. 90ల్లో టాప్ హీరోయిన్ గా నిలిచిన ఆమె చూడ‌చ‌క్క‌ని అందం, అభిన‌యంతో ఆక‌ట్టుకుంది.సోనాలి మురారి, ఖ‌డ్గం, ఇంద్ర‌, ప‌ల్నాటి బ్ర‌హ్మ‌నాయుడు, మ‌న్మ‌ధుడు, శంక‌ర్ దాదా ఎంబీబీఎస్ వంటి తెలుగు చిత్రాల‌లోను న‌టించిన సంగ‌తి తెలిసిందే.


3740
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles