అక్ష‌య్ కుమార్ గోల్డ్ ట్రైల‌ర్ రిలీజ్ ఎప్పుడంటే ?

Tue,June 19, 2018 12:41 PM
gold trailer time fixed

ఖిలాడీ స్టార్ అక్ష‌య్ కుమార్ 1946 ఒలింపిక్స్‌ లో భారత దేశానికి హాకీలో గోల్డ్‌ మెడల్‌ అందించిన హాకీ జట్టు కోచ్‌ జీవిత కథ నేపథ్యంగా గోల్డ్ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే . స్ట్పోర్ట్స్ డ్రామాగా తెర‌కెక్కిన ఈ చిత్ర టీజ‌ర్ తాజాగా విడుద‌లైంది. ఇందులో ఓ వ్యక్తి క‌లని చాలా సింపుల్‌గా వివ‌రించారు. 200 సంవ‌త్స‌రాలు మ‌న‌ని పాలించిన బ్రిటీష్ వారు మ‌న జెండాకి సెల్యూట్ చేయాల్సిన ప‌రిస్థితిని ఓ వ్య‌క్తి తీసుకొచ్చారంటూ టీజ‌ర్‌లో చెప్పారు. ఇది ప్ర‌తి ఒక్క‌రిని ఆక‌ట్టుకుంటుంది. రీమా కగ్టి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో మౌనీ రాయ్‌, కునాల్‌ కపూర్‌, అమిత్‌ సద్‌, వినీత్‌ కుమార్‌సింగ్‌లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్స‌వ శుభాకాంక్ష‌ల‌తో ఆగ‌స్ట్ 15న చిత్రం విడుద‌ల కానుండ‌గా, జూన్ 25న చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల చేయ‌నున్నారు. ట్రైల‌ర్ సినిమాపై భారీ ఆస‌క్తి క‌లిగించేలా ఉంటుందని టీం చెబుతుంది. మ‌రోవైపు కేసరి అనే చారిత్రాత్మక చిత్రంతో వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నాడు అక్షయ్. బ్రిటీష్ ఇండియన్ బృందాలకు, ఆఫ్ఘనిస్థాన్ బృందాలకు మధ్య జరిగిన సరాగర్హి యుద్ధం నేపథ్యంలో ఈ కథ నడవనుంది. అనురాగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అక్షయ్ సిక్కుగా కనిపించనున్నాడని టాక్.906
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS