అక్ష‌య్ ఖాతాలో మ‌రో గోల్డ్‌

Wed,August 15, 2018 09:52 PM
Gold movie review

గోల్డ్‌. ఓ ప‌త‌కం కోసం ఇదే పోరాటం. మ‌న‌ల్ని పాలించిన వాళ్ల‌పై ఇదో ప్ర‌తీకారం.
దేశ విభ‌జ‌న‌కు ముందు మ‌నం హాకీలో హీరోలం. కానీ ఆ క్రెడిట్ అంతా బ్రిటీష్ పాల‌కుల‌కు వెళ్లింది..
ఆడింది మ‌న ప్లేయ‌ర్లే అయినా.. స్వాతంత్ర్యానికి ముందు మ‌నం బ్రిటీష‌ర్ల‌కు బానిస‌లం

మ‌ళ్లీ ఒలింపిక్స్ వ‌చ్చాయి. ఇప్పుడు మ‌న‌కు స్వాతంత్ర్యం వ‌చ్చింది. ఇక మ‌న స‌త్తా చాటాలి
ఈసారి హాకీ గోల్డ్ మ‌న‌దే కావాలి. ఆ త‌ప‌న‌తోనే ఆడాలి. బ్రిటీష్ వాళ్లు వెళ్లిపోయారు. అంతేకాదు మ‌న నుంచి పాక్ ప్రాంత‌ ఆట‌గాళ్లు వేర‌య్యారు. ఇప్పుడు ఇండియా, పాక్ రెండూ ఒలింపిక్స్‌లో పోటీకి దిగాయి. హ్యాట్రిక్ గోల్డ్ కొట్టాల‌న్న‌దే భార‌త్ కాంక్ష‌

1936లో జ‌రిగిన బెర్లిన్ ఒలింపిక్స్‌లో.. హాకీలో ఇండియా గోల్డ్ మెడ‌ల్ సాధించింది. నాజీ నియంత హిట్ల‌ర్ మ‌న టీమ్ దూకుడును అడ్డుకునేందుకు ఎంతో ప్ర‌య‌త్నించాడు. కానీ విఫ‌ల‌మ‌వుతాడు. మ‌న వాళ్ల దూకుడుకు స్వ‌ర్ణ ప‌త‌కం మ‌న సొంతం అవుతుంది. మేనేజ‌ర్ త‌ప‌న్ దాస్(అక్ష‌య్ కుమార్‌) వేసిన ప్ర‌ణాళిక‌లు టీమిండియాకు ప‌త‌కాన్ని తీసుకువ‌స్తాయి.

ఆ త‌ర్వాత రెండ‌వ ప్ర‌పంచ యుద్ధం రావ‌డంతో వ‌రుస‌గా రెండు సార్లు ఒలింపిక్స్ క్రీడ‌ల‌ను నిర్వ‌హించ‌లేక‌పోతారు. ఆ స‌మ‌యంలో త‌ప‌న్ దాస్ తాగుబోతుగా మారుతాడు. హాకీ స‌మాఖ్య నుంచి జాబ్ ఊడిపోతుంది. బెంగాలీ త‌ప‌న్ దాస్ వ్య‌స‌నం ముదురుతుంది. మ‌ళ్లీ 1948లో ఒలింపిక్స్ నిర్వ‌హ‌ణ‌కు గ్రీన్ సిగ్న‌ల్ వ‌స్తుంది. ఆ క్రీడ‌ల‌ను లండ‌న్‌లో నిర్వ‌హించాల‌ని ఫిక్స్ చేస్తారు. అదే స‌మ‌యంలో మన ద‌గ్గ‌ర దేశ విభ‌జ‌న జ‌రుగుతంది. దీంతో పాక్ ప్రాంతానికి చెందిన ఇండియ‌న్ టీమ్‌లోని ప్లేయ‌ర్లు మ‌న‌కు దూరం అవుతారు. ప‌టిష్ట‌మైన‌ టీమిండియాను త‌యారు చేయాల‌నుకున్న త‌ప‌న్ దాస్ ప్ర‌య‌త్నాల‌కు చెక్ ప‌డుతుంది. అప్ప‌టి వ‌ర‌కు ఒక్క‌టిగా ఉన్న ఇండియ‌న్ టీమ్‌లోని ప్లేయ‌ర్లు విడిపోతారు. కొంద‌రు కీల‌క‌మైన ఆట‌గాళ్లు పాక్‌లో స్థిర‌ప‌డేంద‌కు వెళ్తారు.

ఆ ద‌శ‌లో త‌ప‌న్ దాస్ ఆశ‌లు వ‌దులుకుంటాడు. టీమ్‌ను ఎలా త‌యారు చేయాలో అర్థం కాదు. అప్పుడు మాజీ కెప్టెన్ అత‌నికి అండ‌గా నిలుస్తాడు. ప్లేయ‌ర్ల‌ను వెతికి తీసుకువ‌స్తే, తాను కోచింగ్ ఇస్తానంటాడు. అప్పుడు త‌ప‌న్ కిందామీదా ప‌డి కొంద‌రు ప్లేయ‌ర్ల‌ను పోగు చేస్తాడు. అయితే వాళ్ల‌కు ట్రైనింగ్ ఇప్పించ‌డం అంత స‌లువు కాదు. ఓ బౌద్ధ కేంద్రంలో కోచింగ్ మొద‌లుపెడుతారు. ఆ త‌ర్వాత ఇక ఇండియ‌న్ టీమ్.. లండ‌న్ ఒలింపిక్స్‌కు బ‌య‌లుదేరుతుంది. రెండు వంద‌ల ఏళ్లు పాలించిన బ్రిటీష్ టీమ్‌ను స్వంత దేశంలో ఓడించాల‌న్న త‌ప‌న‌తో ఇంగ్లండ్ జ‌ట్టుపై టీమిండియా చెల‌రేగిపోతుంది.

మ‌న టీమ్ సెమీస్‌కు ఈజీగా వెళ్తుంది. ఒక సెమీస్‌లో పాక్‌తో ఇంగ్లండ్‌, మ‌రో సెమీస్‌లో భార‌త్‌తో నెద‌ర్లాండ్స్ త‌ల‌ప‌డుతాయి. చివ‌ర‌కు ఇంగ్లండ్‌, భార‌త్ ఫైన‌ల్లో ప్ర‌వేశిస్తాయి. అనుకున్న స‌మ‌యం వ‌చ్చేసింది. బ్రిటీష‌ర్ల‌పై ప్ర‌తీకారం తీర్చుకోవడానికి ఇదో మంచి త‌రుణం. అయితే టీమ్ కూర్పులో చివ‌ర్లో గొడ‌వ జ‌రుగుతంది. ఫార్వ‌ర్డ్ పొజిష‌న్ కోసం ఇద్ద‌రు ప్లేయ‌ర్ల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ జ‌రుగుతంది. దాంతో టీమిండియా కొంత బ‌ల‌హీన‌ప‌డుతుంది. కానీ చివ‌ర్లో ఆ ఇద్ద‌రు ప్లేయ‌ర్లు క‌లిసి ఇంగ్లండ్ టీమ్‌కు స్వంత గ‌డ్డ‌పైనే షాకిస్తారు. బ్రిటీష్ నేల‌పై త్రివ‌ర్ణ ప‌తాకం రెప‌రెప‌లాడుతుంది.

గోల్డ్ చిత్రాన్ని అత్య‌ద్భుతంగా తెర‌కెక్కించారు. హాకీ మెళుకువులు ఎక్కువ‌గా లేక‌పోయినా.. క‌థ‌ను న‌డిపిన తీరు ఆక‌ట్టుకుంటుంది. త‌ప‌న్ పాత్ర‌లో అక్ష‌య్ కుమార్ సూప‌ర్‌గా న‌టించారు. డైర‌క్ష‌న్‌, కెమెరా వ‌ర్క్‌, డైలాగ్స్‌, సాంగ్స్ అన్నీ హైలైట్‌.

3593
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles