దుమ్ము రేపుతున్న 'గాడ్జిల్లా - కింగ్ ఆఫ్ ది మాన్‌స్టర్స్' ట్రైలర్

Sun,July 22, 2018 01:13 PM
Godzilla King of the monsters trailer launched

వార్నర్ బ్రదర్స్, లెజెండరీ పిక్చర్స్ సంయుక్త నిర్మాణంలో వచ్చిన 'గాడ్జిల్లా (2014)', 'కాంగ్: స్కల్ ఐల్యాండ్' సినిమాలు ఎంతటి ఘన విజయాన్ని సాధించాయో అందరికీ తెలిసిందే. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి. ఈ క్రమంలోనే త్వరలో గాడ్జిల్లా సిరీస్‌లో మరో కొత్త సినిమా ప్రేక్షకులను అలరించనుంది. 'గాడ్జిల్లా - కింగ్ ఆఫ్ ది మాన్‌స్టర్స్' పేరిట 2019, మే 31వ తేదీన మరో నూతన గాడ్జిల్లా సినిమా విడుదల కానుంది. అయితే ఈ సినిమాకు చెందిన అఫిషియల్ ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు. శాన్‌డియాగోలో జరుగుతున్న కామిక్ కాన్‌లో ట్రైలర్‌ను లాంచ్ చేశారు. కాగా ట్రైలర్ విడుదలైన 12 గంటలలోపే 40 లక్షల మంది దాన్ని వీక్షించారు. ఈ క్రమంలోనే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఒకప్పుడు గాడ్జిల్లా, మోత్రా కథాంశంతో వచ్చిన సినిమా తరహాలో ఈ కొత్త సినిమా ఉంటుందని తెలుస్తున్నది. ఈ సినిమాకు మైకేల్ డోహర్తీ దర్శకత్వం వహించారు.

3637
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles