డిస్కోరాజా గోవా షెడ్యూల్ పూర్తి.. డిసెంబ‌ర్ 20న విడుద‌ల‌

Sun,September 15, 2019 10:12 AM

మాస్ మ‌హారాజా ర‌వితేజ న‌టిస్తున్న తాజా చిత్రం డిస్కోరాజా. వీఐ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న‌ ఈ చిత్రం డిసెంబర్ 20,2019న విడుద‌ల కానుంది. ఎస్‌.ఆర్‌.టి. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామ్‌ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘ఇస్మార్ట్ శంక‌ర్ ’ ఫేమ్‌ నభా నటేశ్‌ను ఓ నాయికగా, ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ పాయల్‌ రాజ్‌పుత్‌ను మరో నాయికగా న‌టిస్తున్నారు. వెన్నెల కిషోర్, సునీల్‌ ప్రధాన పాత్రలో నటించనున్న ఈ చిత్రానికి ఎస్‌.ఎస్‌. తమన్‌ స్వరకర్త. రివేంజ్ డ్రామా బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రం రూపొందుతుంది. ఇటీవ‌ల చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌ల కాగా, దీనికి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. కొద్ది రోజులుగా చిత్రం గోవా షెడ్యూల్ జ‌రుపుకుంటుండ‌గా, రీసెంట్‌గా పూర్తైంది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ని వేగవంతంగా పూర్తి చేసి అనుకున్న‌టైంకి సినిమాని పూర్తి చేయాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నారు.

803
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles