కంప్లీట్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా 'ప్ర‌తిరోజూ పండగే'

Wed,October 16, 2019 08:33 AM

సాయిధ‌ర‌మ్ తేజ్, మారుతి కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ప్ర‌తిరోజూ పండ‌గే. రాశీ ఖ‌న్నా క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ సినిమాలో స‌త్య‌రాజ్ ముఖ్య పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నారు. మంగ‌ళ‌వారం సాయిధ‌ర‌మ్ తేజ్ బ‌ర్త్‌డే కావ‌డంతో చిత్రం నుండి ఓ వీడియో విడుద‌ల చేశారు. ఈ వీడియోని చూస్తుంటే చిత్రం ప‌క్కా ఫ్యామిలీ ఎంట‌ర్‌టైనింగ్ ఉంటుంద‌ని అర్ధ‌మ‌వుతుంది. స‌త్య‌రాజ్, తేజ్ మ‌ధ్య స‌న్నివేశాలు ఆక‌ట్టుకునేలా ఉన్నాయి. థ‌మన్ సంగీతం అల‌రిస్తుంది. యువీ క్రియేష‌న్స్ , జీఏ2 పిక్చ‌ర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం సాయిధ‌ర‌మ్ తేజ్‌కి మంచి విజ‌యం అందిస్తుంద‌ని మేక‌ర్స్ అంటున్నారు.

940
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles