కేన్స్ ఫిలిం ఫెస్టివ‌ల్‌లో తారల సంద‌డి

Wed,May 15, 2019 12:25 PM

ప్రపంచంలోనే అతి పెద్ద ఫిలిం ఫెస్టివల్‌గా చెప్పుకొనే కేన్స్ చ‌ల‌న‌చిత్రోత్స‌వ వేడుక మంగ‌ళ‌వారం సాయంత్రం (ఫ్రాన్స్‌ కాలమానం ప్రకారం) ఘ‌నంగా ప్రారంభ‌మైంది. ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న టాలెంట్ ఆర్టిస్ట్‌లు ఈ వేడుక‌లో పాల్గొన‌నున్నారు. ప‌ద‌కొండు రోజుల పాటు ఎంతో ఘ‌నంగా జ‌ర‌గ‌నున్న ఈ వేడుక‌లో తార‌లు రెడ్ కార్పెట్‌పై సంద‌డి చేయ‌నున్నారు. 72వ అంత‌ర్జాతీయ కేన్స్ చ‌లన చిత్రోత్స‌వ వేడుక‌కి ఫ్రెంచ్‌ నటుడు, దర్శకుడు ఎడ్వర్డ్‌ బాయర్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తారు.


కేన్స్ వేడుక ‘ది డెడ్‌ డోన్ట్‌ డై’ సినిమా ప్రీమియర్‌ షోతో ప్రారంభం కాగా ఈ కార్య‌క్ర‌మానికి ఎల్లే ఫాన్నింగ్‌, టిల్డా స్విన్ట‌న్‌, సెలెనా గోమెజ్‌, ఎవా లొంగొరియా, జులియానా మూరే త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. ఫ్రాన్స్‌లోని ఫ్రెంచ్‌ రివేరా నదీ తీరాన ఉన్న కేన్స్‌ ప్రాంతంలో జ‌రుగుతున్న ఈ వేడుక‌కి ఇండియ‌న్ సెల‌బ్రిటీలు దీపికా ప‌దుకొణే, ఐశ్వ‌ర్య‌రాయ్ బ‌చ్చ‌న్‌, సోన‌మ్ క‌పూర్, కంగ‌నా ర‌నౌత్‌, డైనా పెంటి, మ‌ల్లికా షెరావత్, హీనా ఖాన్ త‌దిత‌రులు హాజ‌రు కానున్నారు. వీరు రెడ్ కార్పెట్‌పై వివిధ డ్రెస్సుల‌తో సంద‌డి చేయ‌నున్నారు. కేన్స్‌ వేడుకకు ప్రముఖ మెక్సికన్‌ దర్శకుడు అలెజాండ్రో అధ్యక్షత వహిస్తున్నారు.

1191
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles