షిరిడీకి వస్తుంటే ఒంటెపై స్వారీ చేసినట్టుంది..

Wed,September 19, 2018 06:36 PM
Ghoti to Shirdi travelling like a camel ride says sukhwinder singh

నాసిక్ : సాయిబాబా కొలువుదీరిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం షిరిడీలో రహదారి తీవ్రంగా దెబ్బతినడం పట్ల ప్రముఖ గాయకుడు సుఖ్విందర్ సింగ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. షిరిడీ ఆలయాన్ని సుఖ్విందర్‌సింగ్ సందర్శించి ప్రత్యేక పూజలు చేశాడు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఘోటి నుంచి షిరిడీకి వచ్చే రహదారిపై ఎక్కిడికక్కడ గుంతలు ఉండటంతో ప్రయాణం చాలా కష్టమవుతుందని అన్నాడు. ఘోటి-షిరిడీ మార్గంలో కారులో రావడానికి తనకు గంటన్నర పట్టిందని చెప్పాడు.

పూర్తిగా దెబ్బతిన్న రోడ్డు మీదుగా షిరిడీకి వస్తుంటే తనకు ఒంటె స్వారీ చేసినట్లు అనిపించిందని చమత్కరించాడు సుఖ్విందర్‌సింగ్. అధికారులు అధ్వాన్నంగా ఉన్న రోడ్లను అధికారులు వెంటనే బాగు చేయించాలని సుఖ్విందర్ సింగ్ కోరాడు. విదేశాల్లో వర్షంతో రహదారులు దెబ్బతినవు..కానీ మన దగ్గర వర్షంతో రోడ్లపై ఎందుకు గుంతలు ఏర్పడతాయో చెప్పాలని సుఖ్విందర్ ప్రశ్నించాడు. ఔరంగాబాద్-షిరిడీ-పుంటంబా మార్గంలో కూడా భారీగా గుంతలు ఉన్నాయని వాటిని కూడా బాగు చేయాలని విజ్ఞప్తి చేశాడు సుఖ్విందర్‌సింగ్.

2786
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles