ఘూమర్ పాటలో మొత్తం కవర్ చేశారు

Sat,January 20, 2018 03:49 PM
ghoomar song new version available

అనేక వివాదాల మధ్య నలిగిన సంజయ్ లీలా భన్సాలీ క్రేజీ ప్రాజెక్ట్ పద్మావత్ మూవీ పలు మార్పులతో ఎట్టకేలకి జనవరి 25న రిలీజ్ కి రెడీ అయిన సంగతి తెలిసిందే. సీబీఎఫ్ సీ సూచనల మేరకు చిత్రంలోని కొన్ని సీన్స్ ని డిలీట్ చేయడంతో పాటు సినిమా టైటిల్ ని కూడా మార్చారు. అయితే గత నెలలో విడుదలైన ఘూమర్ పాటకి సంబంధించి ప్రధానంగా కొన్ని సీన్స్ ని మార్పు చేసినట్టు తాజాగా విడుదలైన కొత్త ఘూమర్ వీడియో సాంగ్ ని చూస్తే తెలుస్తుంది. ఘూమర్ పాట గత నెలలో విడుదల కాగా ఇందులో దీపిక నృత్యం, ఆమె నడుము భాగాన్ని చూపించడం కర్ణిసేనకి, రాజ్ పుత్ లకి అస్సలు నచ్చలేదు. పద్మావతి పాత్ర చేస్తూ ఇలాంటి గంతులేయడమేంటని వారు కన్నెర్ర చేశారు. దీంతో చిత్ర యూనిట్ ఘూమర్ పాటలో దీపిక నడుము ఎక్కడ కనిపించకుండా కంప్యూటర్ జనరేటెడ్ వస్త్రంతో కవర్ చేశారు. యూ/ఏ సర్టిఫికెట్ పొందిన ఈ సినిమా తప్పక అలరిస్తుందని చిత్ర యూనిట్ చెబుతుంది. మరో వైపు కర్ణిసేన ఈ సినిమాని విడుదలని అడ్డుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఈ సినిమా విడుదలైతే థియేటర్స్ అన్ని ధ్వంసం చేస్తామని కూడా వారు హెచ్చరిస్తున్నారు. మరోవైపు పద్మావత్ మూవీ విడుదల కారణంగా అక్షయ్ కుమార్ తన ప్యాడ్ మాన్ చిత్రాన్ని ఫిబ్రవరి 9కి పోస్ట్ పోన్ చేసుకున్నాడు.

1446
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles