ఘూమర్ సాంగ్‌కు స్కేటింగ్ డ్యాన్స్.. వైరల్ వీడియో

Fri,February 2, 2018 04:49 PM
Ghoomar Dance on Ice is now breaking the Internet

ఎన్నో వివాదాల మధ్య రిలీజైనా.. బాక్సాఫీస్ దగ్గర పద్మావత్ మూవీ కలెక్షన్ల సునామీ ఎలా ఉందో చూస్తూనే ఉన్నాం. అలాగే ఈ మూవీలో ఘూమర్ సాంగ్‌కు దీపికా పదుకోన్ వేసిన స్టెప్స్ కూడా సినిమాకే హైలైట్‌గా నిలిచాయి. పెద్ద హిట్ అయిన ఈ సాంగ్‌పై ఎన్‌బీఏలాంటి టోర్నీలోనూ అపర్ణ యాదవ్ పర్ఫామ్ చేసింది. తాజాగా ఫిగర్ స్కేటింగ్ చాంపియన్ మయూరి భండారీ ఐస్‌పై వేసిన స్టెప్స్ ఇంటర్నెట్‌ను బ్రేక్ చేస్తున్నాయి. ఘూమర్ డ్యాన్స్ ఆన్ ఐస్ పేరుతో మయూరీ ఈ వీడియోను యూట్యూబ్‌లో పోస్ట్ చేసింది. స్కేట్స్, రెడ్ కాస్టూమ్స్‌లో మయూరీ చేసిన ఈ డ్యాన్స్‌కు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. అసలు దీపికాను మించి చేసిందే అంటూ నోరెళ్లబెడుతున్నారు. పద్మావతి రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఓ రాజస్థానీగా ఇదే తన ట్రిబ్యూట్ అంటూ ఆ వీడియోను పోస్ట్ చేసింది. జనవరి 26న ఈ వీడియోను పోస్ట్ చేయగా.. ఇప్పటికే 17 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ వీడియో మీరూ చూడండి..

1940
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles