ట్రైలర్ తో అంచనాలు పెంచిన రానా

Wed,January 11, 2017 12:03 PM
ట్రైలర్ తో అంచనాలు పెంచిన రానా

ద‌గ్గుబాటి రానా ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ఘాజీ. ఈ చిత్రంలో తాప్సీ, క‌య్ క‌య్ మీన‌న్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. ఈ చిత్రాన్ని మ్యాట్నీ ఎంట‌ర్ టైన్మెంట్, పి.వి.పి సినిమా సంయుక్తంగా నిర్మించాయి. సంక‌ల్ప్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన‌ ఈ భారీ చిత్రం ట్రైలర్ తాజాగా విడుదలైంది. 1971లో భారత్ -పాక్ మధ్య జరిగిన యుద్ధ సమయంలో నీట మునిగిన సబ్ మెరైన్ నేపథ్యంలో ఘాజీ చిత్రాన్ని తెరకెక్కించాడు.

స‌బ్ మేరిన్ బ్యాక్ డ్రాప్ తో రూపొందుతున్న తొలి ఇండియాన్ మూవీ ఘాజీ కావ‌డం విశేషం. ఈ మూవీని హాలీవుడ్ రేంజ్ లో రూపొందిస్తున్నారు. ఇప్ప‌టి వర‌కు తెలుగు ప్రేక్ష‌కులు చూడ‌ని విధంగా హై టెక్నిక‌ల్ వాల్యూస్ తో ఈ చిత్రాన్ని రూపొందించారు. వైవిధ్యమైన క‌థాంశంతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా ఫిబ్ర‌వ‌రి 17న రిలీజ్ చేయ‌నున్నారు. మాట్నీ ఎంటర్టెయిన్మెంట్, పీవీపీ సినిమాలు కలిసి ఘాజీ చిత్రాన్ని నిర్మించాయి. తెలుగు, తమిళం, హిందీ భాషలలో విడుదలైన ట్రైలర్ పై మీరు ఓ లుక్కేయండి.

తెలుగు ట్రైలర్


తమిళ ట్రైలర్


హిందీ ట్రైలర్

1762
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS