మెగా హీరోని డైరెక్ట్ చేయ‌నున్న ఘాజీ డైరెక్ట‌ర్‌..!

Fri,December 15, 2017 12:41 PM
మెగా హీరోని డైరెక్ట్ చేయ‌నున్న ఘాజీ డైరెక్ట‌ర్‌..!

ఘాజీ చిత్రంతో నేషనల్ స్టార్ డం పొందిన యువ దర్శకుడు సంకల్ప్ రెడ్డి. ఈ దర్శకుడు తన తొలి చిత్రంగా ఘాజీని తెరకెక్కించి దేశ వ్యాప్తంగా అందరి మన్ననలు పొందాడు. తొలి చిత్రం అయినప్పటికి సంకల్ప్ తెరకెక్కించిన విధానం అందరిని అలరించింది. తెలుగుతో పాటు బాలీవుడ్‌లోను ఏక‌కాలంలో రూపొందిన ఈ చిత్రం త‌మిళంలోను డ‌బ్ అయి అంద‌రిచే ప్రశంస‌లు అందుకుంది. సంక‌ల్ప్ ప్ర‌స్తుతం తన రెండవ సినిమాకు ప్లాన్ చేసుకుంటున్నాడు . ఈ చిత్రం కూడా గ్రాఫిక్స్ నేపథ్యంలో సైన్స్ ఫిక్షన్ కథగా ఉంటుందని సమాచారం. మరి ఇందులో నటించే హీరో ఎవరా అంటే ముకుంద సినిమాతో వెండితెర ఆరంగేట్రం చేసి ఇప్పుడు సక్సెస్ బాటలో సైలెంట్ గా వెళుతున్న వరుణ్ తేజ్ అని తెలుస్తుంది. ఈ హీరో ప్రస్తుతం వైవిధ్యమైన సినిమాలు చేస్తూ అలరిస్తున్నాడు. ఇటీవ‌ల ఫిదా అనే చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన వరుణ్ తేజ్‌, త్వ‌ర‌లో తొలిప్రేమ అనే చిత్రంతో అభిమానుల‌ని అల‌రించనున్నాడు. దీని తర్వాత ఘాజీ లాంటి సూపర్ హిట్ సినిమాని అందించిన దర్శకుడితో సినిమా చేయనున్నాడట. ఈ సైన్స్ ఫిక్షన్ మూవీకి సంబంధించి పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు కూడా జ‌రుగుతున్నాయ‌ని స‌మాచారం.

1358

More News

VIRAL NEWS