అఖిల్ మూవీ టైటిల్‌పై ఎనౌన్స్‌మెంట్ రావ‌డ‌మే త‌రువాయి

Fri,September 7, 2018 11:46 AM
gets clarity on akhil movie title

అక్కినేని మూడోత‌రం వార‌సుడు అఖిల్ న‌టించిన తొలి రెండు చిత్రాలు ఫ్లాప్ కావ‌డంతో మూడో సినిమాని ఛాలెంజ్‌గా తీసుకొని చేస్తున్నాడు. తొలి ప్రేమ వంటి సూప‌ర్ హిట్ చిత్రం తెర‌కెక్కించిన వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వంలో అఖిల్ మూడో సినిమా తెర‌కెక్కుతుంది. ప్ర‌స్తుతం విదేశాల‌లో షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రానికి మిస్ట‌ర్ మ‌జ్ను అనే టైటిల్ ఫిక్స్ చేశార‌ని, త్వ‌ర‌లోనే దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌నుంద‌ని అంటున్నారు. చిత్రంలో నిధి అగర్వాల్ క‌థానాయిక‌గా న‌టిస్తుండ‌గా, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై చిత్రం నిర్మిత‌మవుతుంది. ఈ సినిమాలో విద్యుల్లేఖారామన్ కీలక పాత్రలో నటిస్తోంది. వెంకీ అట్లారీ దర్శకత్వం వహించిన తొలిప్రేమ చిత్రం బాక్సాపీస్‌ని షేక్ చేయడంతో ఇప్పుడు తెర‌కెక్కిస్తున్న రొమాంటిక్ ల‌వ్ స్టోరీ కూడా మంచి విజ‌యం సాదిస్తుంద‌ని టీం భావిస్తుంది. అఖిల్ ఈ చిత్రంతో అయిన మంచి సక్సెస్ సాధించాల‌ని ఆయ‌న అభిమానులు కోరుకుంటున్నారు.

1754
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS