అఫీషియ‌ల్ : 96 రీమేక్‌లో శ‌ర్వానంద్, స‌మంత‌

Sat,January 26, 2019 12:27 PM
gets clarity on  96 remake

గ‌త‌ ఏడాది త‌మిళ సూప‌ర్ హిట్ చిత్రాల‌లో ఒక‌టిగా నిలిచిన చిత్రం 96. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి , చెన్నై చంద్రం త్రిష జంటగా నటించిన ఈ త‌మిళ చిత్రం ప్రేమ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కింది. ఈ చిత్రానికి విమ‌ర్శకుల ప్ర‌శంస‌లు ల‌భించాయి. ఈ చిత్ర తెలుగు రైట్స్ దిల్ రాజు ద‌క్కించుకోగా త్వ‌ర‌లోనే రీమేక్ కి సంబంధించిన విష‌యాలు ప్ర‌కటిస్తాన‌ని గ‌తంలో చెప్పాడు. రిప‌బ్లిక్ డేని పుర‌స్క‌రించుకొని 96 రీమేక్‌పై క్లారిటీ ఇచ్చారు దిల్ రాజు. శ్రీ వెంక‌టేశ్వ‌ర బేన‌ర్‌లో 34వ చిత్రంగా రూపొంద‌నున్న ఈ చిత్రంలో శ‌ర్వానంద్‌, స‌మంత ప్రధాన పాత్ర‌లు పోషించ‌నున్న‌ట్టు తెలిపారు. త‌మిళ వ‌ర్షెన్‌ని తెర‌కెక్కించిన ప్రేమ్ కుమార్ తెలుగులోను డైరెక్ట్ చేయ‌నున్నాడు. మార్చి నుండి చిత్రం సెట్స్ పైకి వెళ్ల‌నుంది. 96 చిత్రం క‌న్న‌డ వ‌ర్షెన్‌లోను రీమేక్ అవుతున్న‌ విష‌యం తెలిసిందే. 99 అనే టైటిల్‌ని క‌న్న‌డ వ‌ర్షెన్‌కి ఫిక్స్ చేసిన‌ట్టు తెలుస్తుంది. రాము ఎంటర్‌టైన్‌మెంట్స్ అనే సంస్థ క‌న్న‌డ వ‌ర్షెన్‌కి సంబంధించిన రైట్స్‌ని చేజిక్కించుకోగా, ప్రీత‌మ్ గుబ్బి ద‌ర్శ‌క‌త్వంలో ఈ మూవీ తెర‌కెక్కుతుంది. అర్జున్ జ‌న్యా సంగీతం స‌మ‌కూరుస్తున్నారు.



1519
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles