మ‌హేష్ బాబు త‌ల్లి పాత్ర‌పై వ‌చ్చిన క్లారిటీ

Thu,August 30, 2018 10:20 AM
gets clarity about mahesh mother role

వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేష్ హీరోగా తెర‌కెక్కుతున్న చిత్రం మ‌హ‌ర్షి. దిల్‌రాజు, అశ్విని దత్‌, పీవీపీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. చిత్రంలో మ‌హేష్ స‌ర‌స‌న పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టిస్తుండ‌గా, అల్ల‌రి న‌రేష్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నాడు. దేవి శ్రీ ప్ర‌సాద్ స్వరాలు స‌మకూరుస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ తల్లిగా అలనాటి అందాల నటి జయప్రధ నటించనున్నారని పుకార్లు షికారు చేశాయి. ఈ విషయంపై స‌హ‌జ‌ నటి జయసుధ ఓ ఇంటర్య్వూలో క్లారిటీ ఇచ్చారు. మహర్షి సినిమాతో తాను మహేష్‌కు తల్లిగా నటిస్తున్నట్టుగా వెల్లడించారు. దీంతో అభిమానుల‌లో నెలకొన్న సందేహాల‌పై క్లారిటీ వచ్చింది. భారీ అంచనాల నడుమ 2019 ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు ‘మహర్షి’. చిత్రంలో మహేష్ విద్యార్థిగా, యూఎస్ కంపెనీ సీఈవోగా రిషీ పాత్ర‌లో కనిపించనున్నారు. చిత్ర టీజ‌ర్ ఇటీవ‌ల విడుద‌ల కాగా, ఇది మ‌హేష్ అభిమానుల ఆనందాన్ని రెట్టింపు చేసింది.

2974
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles