రోడ్డు ప్రమాదంలో ‘300’ యాక్టర్‌కు గాయాలు..

Tue,October 17, 2017 01:20 PM
రోడ్డు ప్రమాదంలో ‘300’ యాక్టర్‌కు గాయాలు..


లాస్ ఏంజెల్స్: లాస్‌ఏంజెల్స్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రముఖ హాలీవుడ్ యాక్టర్ గెరార్డ్ బట్లర్‌కు గాయాలయ్యాయి. 47 ఏళ్ల గెరార్డ్ బట్లర్ బైకుపై వెళ్తుండగా ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. దీంతో బైకుపై నుంచి కిందపడి బట్లర్‌కు గాయాలయ్యాయి. వెంటనే అతన్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. స్వల్పగాయాలతో బయటపడ్డ బట్లర్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. వారం క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా బయటకు వచ్చింది. గెరార్డ్ బట్లర్ 300 మూవీలో తన నటనతో వరల్డ్‌వైడ్‌గా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు.

1418

More News

VIRAL NEWS