వైర‌ల్‌గా మారిన జెమినీ గ‌ణేష‌న్ కూతుళ్ళ ఫోటో

Sun,May 20, 2018 10:08 AM
Gemini Ganeshans seven daughters from different wifes

నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో సావిత్రి జీవిత నేప‌థ్యంలో తెర‌కెక్కిన చిత్రం మ‌హాన‌టి. ఈ మూవీ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర భారీ విజ‌యం సాధించింది. విమ‌ర్శ‌కులు కూడా ఈ మూవీపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. యూఎస్‌లో ఈ సినిమా 2 మిలియ‌న్ డాల‌ర్ల వ‌సూళ్ళు రాబట్టి స్టార్ హీరోల సినిమాల‌కి ఏ మాత్రం త‌క్కువ కాద‌ని నిరూపించింది. మ‌హాన‌టి చిత్రంలో సావిత్రి జీవిత నేప‌థ్యం గురించి క్లుప్తంగా చూపించాడు నాగ్ అశ్విన్‌. సినిమా మంచి విజ‌యం సాధించ‌డంతో ఆమె గురించి, సావిత్రి భ‌ర్త జెమినీ గ‌ణేష‌న్ గురించి పూర్తి వివ‌రాలు తెలుసుకునేందుకు నెటిజ‌న్స్ చాలా ఉత్సుక‌త చూపిస్తున్నారు.

ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో జెమినీ గ‌ణేష‌న్ కూతుళ్లంద‌రు క‌లిసి దిగిన గ్రూప్ ఫోటో చక్క‌ర్లు కొడుతుంది. జెమినీ గ‌ణేష‌న్ మూడు వివాహాలు చేసుకోగా ఆయ‌న‌కి అల‌మేలు, పుష్ప‌వ‌ల్లి, సావిత్రి అనే ముగ్గురు భార్య‌లున్నారు. అల‌మేలుకి డాక్ట‌ర్ జ‌యా శ్రీధ‌ర్‌, డాక్ట‌ర్ రేవ‌తి, డాక్ట‌ర్ క‌మ‌లా సెల్వారాజ్, నారాయ‌ణి అనే న‌లుగురు కూతుళ్ళు ఉన్నారు. ఇటీవ‌ల క‌మ‌లా మ‌హాన‌టి చిత్రంలో త‌న తండ్రి గురించి త‌ప్పుగా చూపించార‌ని ఆరోపించింది. ఇక పుష్ప‌వ‌ల్లికి సీనియ‌ర్ హీరోయిన్ రేఖ‌, రాధ అనే ఇద్ద‌రు కూతుళ్ళు ఉన్నారు. సావిత్రికి విజ‌య్ చాముండేశ్వ‌రి అనే కూతురితో పాటు స‌తీష్ అనే కొడుకు కూడా ఉన్నాడు. మొత్తంగా జెమినీ గ‌ణేష‌న్‌కి ఏడుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఏడుగురు కుమార్తెలు క‌లిసి క్లోజ్‌గా దిగిన ఫోటోని చూస్తుంటే వీరి మ‌ధ్య మంచి రిలేష‌న్ ఉంద‌నే అనిపిస్తుంది.

6992
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles