యూ ట్యూబ్ నుండి విజ‌య్ దేవ‌ర‌కొండ సాంగ్ ఔట్‌

Fri,July 27, 2018 12:34 PM
Geetha Govindam second song out from you tube

అతి త‌క్కువ టైంలో ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్న హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ప్ర‌స్తుతం ప‌ర‌శురాం ద‌ర్శ‌క‌త్వంలో గీత గోవిందం అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం ఆగ‌స్ట్ 15న విడుద‌ల కానుంది. ఇటీవ‌ల ఫ‌స్ట్ సాంగ్ విడుద‌ల చేసిన టీం నిన్న శ్రీమణి లిరిక్స్ అందించిన ‘వాట్‌ ద ఎఫ్‌’ అనే సాంగ్ విడుద‌ల చేశారు. ఈ పాట‌తో ఫ్రస్టేటెడ్ సింగర్ గా మారాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. అయితే పాట‌లో అమ్మాయిల గురించి విశ్లేషించ‌డం, పురాణాల ప్ర‌స్తావ‌న తెస్తూ కొంద‌రిలో నెగెటివ్ అభిప్రాయాన్ని క‌లిగించ‌డంపై కొంద‌రు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. పాట ట్యూన్ వినడానికి క్యాచీగానే ఉన్నా.. దాంట్లో రాతలే బాలేవు అంటూ నెటిజన్స్ త‌మ అభిప్రాయం వ్య‌క్తం చేశారు. దీనిపై లిరిక్ రైట‌ర్ తెలుగు ప్ర‌జ‌ల‌కి క్ష‌మాప‌ణ‌లు చెబుతూ.. ఎవరిని కించ ప‌ర‌చాల‌నేది మా భావ‌న కాదు. సదరు పాటలోని అభ్యంతరకర పంక్తులను తొలగించి తిరిగి రచించిన ఆ పాటను యూ ట్యూబ్‌లో తిరిగి అప్‌ లోడ్‌ చేస్తామని అన్నారు. గీత గోవిందం చిత్రంలో ర‌ష్మిక మంధాన క‌థానాయిక‌గా న‌టించింది. ప్రొడ్యూస‌ర్ బ‌న్నివాసు నిర్మాణంలో శ్రీ అల్లు అర‌వింద్ గారి స‌మ‌ర్ప‌ణ‌లో GA2 PICTURES బ్యాన‌ర్ లో రూపొందిన ఈ చిత్ర ఆడియో వేడుక ఈనెల 29న గ్రాండ్‌గా జ‌ర‌ప‌నున్నారు. గోపి సుందర్ చిత్రానికి సంగీతం అందించారు.

2983
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles