స్వాతంత్య్ర దినోత్స‌వ శుభాకాంక్ష‌ల‌తో గీత గోవిందం

Tue,July 3, 2018 10:11 AM
Geetha Govindam release date fixed

వ‌రుస సినిమాల‌తో ఫుల్ జోరు మీదున్న విజ‌య్ దేవ‌ర‌కొండ రానున్న రోజుల‌లో అభిమానుల‌కి నాన్‌స్టాప్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందించ‌నున్నాడు. విజ‌య్ న‌టించిన టాక్సీవాలా చిత్రం అతి త్వ‌ర‌లోనే విడుద‌ల కానుండ‌గా, ఆయ‌న ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన గీత గోవిందం రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. స్వాతంత్య్ర దినోత్స‌వ శుభాకాంక్ష‌ల‌తో ఆగ‌స్ట్ 15న చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో పరశురాం తెర‌కెక్కిస్తున్న గీతా గోవిందం సినిమాలో రష్మిక మందన కథానాయికగా న‌టిస్తుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న‌ ఈ సినిమాకి గోపీసుందర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. చిత్రం విభిన్నమైన కథా కథనాలతో ఇంట్రెస్టింగ్‌గా రూపొందుతుంద‌ని అంటున్నారు. తాజాగా చిత్రానికి సంబంధించిన పోస్ట‌ర్ ఒక‌టి విడుద‌ల కాగా, ఇది అభిమానుల‌లో ఆస‌క్తి క‌లిగిస్తుంది. అర్జున్ రెడ్డి త‌ర‌హాలో ఈ సినిమాలోను డ‌బుల్ మీనింగ్ డైలాగ్స్ ఉంటాయా అని ఫ్యాన్స్ ఆలోచ‌న‌లో ప‌డ్డారు. విజ‌య్ దేవ‌ర‌కొండ నోటా, డియ‌ర్ కామ్రేడ్ చిత్రాల‌తో పాటు ఎవడే సుబ్రమణ్యం సినిమా నిర్మించిన స్వప్నా సినిమాస్ బ్యానర్లో స్వప్న దత్ నిర్మాతగా నందిని రెడ్డి డైరక్షన్ లోను సినిమా చేస్తున్నాడట . ఇక అదే కాకుండా రాజు డికె డైరక్షన్ లో కూడా ఓ సినిమా ఉంటుందని తెలుస్తుంది.

1195
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles