'గీత గోవిందం' ఫ‌స్ట్ సాంగ్‌కి అదిరిపోయే రెస్పాన్స్

Wed,July 18, 2018 12:34 PM
Geetha Govindam first song gets huge response

అర్జున్ రెడ్డి సినిమా తర్వాత వరుస సినిమాలతో మంచి జోరుమీదున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం గీతా ఆర్ట్స్ బేనర్ లో గీత గోవిందం అనే సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రష్మిక మందన కథానాయికగా నటిస్తుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాకి గోపీసుందర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. చిత్రం విభిన్నమైన కథా కథనాలతో ఇంట్రెస్టింగ్ గా రూపొందుతుందని అంటున్నారు. ఆగస్ట్ 15న విడుదల కానున్న ఈ సినిమాకి సంబంధించి ఇటీవ‌ల మొద‌టి సాంగ్ విడుద‌ల చేశారు మేక‌ర్స్‌ . ‘ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే’ అంటూ సాగే ఈ పాటని సిద్ శ్రీరామ్ పాడారు. ఈ పాట సంగీత ప్రియులకి ఎంత‌గానో న‌చ్చింది. కేవ‌లం వారం రోజుల‌లోనే 10 మిలియ‌న్స్‌కి పైగా వ్యూస్ రాబ‌ట్టింది. ఈ విష‌యాన్ని చిత్ర యూనిట్ పోస్ట‌ర్ ద్వారా తెలిపింది. లిరిక‌ల్ సాంగ్‌కి వ‌చ్చిన రెస్పాన్స్‌ని బ‌ట్టి చూస్తుంటే సినిమాపై కూడా అభిమానుల‌లో భారీ అంచ‌నాలు ఉన్నాయ‌ని అర్ధ‌మ‌వుతుంది.


2489
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles