విజ‌య్ దేవ‌ర‌కొండ 'గీత గోవిందం' ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

Sat,June 23, 2018 01:58 PM
Geetha Govindam first look revealed

ఎవడే సుబ్రహ్మణ్యం చిత్రంతో అలరించిన విజయ్ దేవరకొండ పెళ్ళి చూపులు చిత్రంతో అందరి దృష్టిని ఆక‌ర్షించాడు . ఇక అర్జున్ రెడ్డి చిత్రంతో ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు. అప్పటి నుండి విజయ్ దేవరకొండకి పెద్ద బేనర్స్‌ నుండి ఆఫర్స్ వస్తున్నాయి. ఇటీవల టాక్సీవాలా అనే చిత్రంలో నటించిన విజయ్ దేవరకొండ మహానటిలో విజయ్ ఆంటోని పాత్ర పోషించాడు. టాక్సీవాలా చిత్రం విడుద‌ల‌కి సిద్ధంగా ఉంది. భరత్ కమ్మ అనే కొత్త దర్శకుడితో సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు విజయ్ దేవరకొండ. పెళ్లి చూపులు చిత్ర నిర్మాతలలో ఒకరైన యాష్‌ రంగినేని ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. డియర్ కామ్రేడ్ అనే టైటిల్ చిత్రానికి ఖరారు చేయగా, ఇందులో విజయ్ కాకినాడ యాసలో మాట్లాడనున్నాడట. కొత్త అమ్మాయిని ఈ చిత్రం కోసం కథానాయికగా తీసుకోనున్నారని సమాచారం.

విజయ్ దేవరకొండ ప్రస్తుతం నోటా అనే బైలింగ్యువల్ మూవీ చేస్తున్నాడు. ఎవడే సుబ్రమణ్యం సినిమా నిర్మించిన స్వప్నా సినిమాస్ బ్యానర్లో స్వప్న దత్ నిర్మాతగా నందిని రెడ్డి డైరక్షన్ లోను సినిమా చేస్తున్నాడట . ఇక అదే కాకుండా రాజు డికె డైరక్షన్ లో కూడా ఓ సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఇక గీతా ఆర్ట్స్ బ్యానర్ లో పరశురాం తెర‌కెక్కిస్తున్న గీతా గొవిందం అనే సినిమా చేస్తున్నాడు విజయ్. రష్మిక మందన కథానాయికగా ఈ సినిమా రూపొందుతోంది. రీసెంట్‌గా చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు. ఇందులో విజ‌య్ కాళ్ల‌పై కూర్చున్న ర‌ష్మిక న‌వ్వుతూ కనిపిస్తుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న‌ ఈ సినిమాకి గోపీసుందర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. చిత్రం విభిన్నమైన కథా కథనాలతో ఇంట్రెస్టింగ్‌గా రూపొంద‌నుంద‌ని అంటున్నారు. మూవీని అతి త్వ‌ర‌లోనే విడుద‌ల చేయ‌నున్నారు.


2023
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles