బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 2 మరి కొద్ది రోజులలో ముగుస్తుందన్న సమయంలో ఈ షో మంచి రసవత్తరంగా మారుతుంది. ఈ సీజన్ కిరీటం కౌశల్‌కి దక్కుతుందని అందరు భావిస్తున్న క్రమంలో బిగ్ బాస్ అందరికి పెద్ద షాక్ ఇచ్చాడు. కౌశల్‌ని సీజన్ మొత్తం ఎలిమినేషన్లో ఉండేలా గేమ్ ప్లాన్ చేశాడు. మర్డర్ మిస్టరీ టాస్క్‌లో భాగంగా గీతా మాధురి .. తనకి ఇచ్చిన టాస్క్‌లన్నీ సక్సెస్ ఫుల్‌గా పూర్తి చేయాలి. వాటితో పాటు హంతకురాలిగా ఉన్న తనని పోలీసాఫీసర్‌గా ఉన్న రోల్ రైడా, డిటెక్టివ్‌గా ఉన్న గణేష్‌లు గుర్తుపట్టకుండా ప్రవర్తించాలి. వీటిలో విజయం సాధిస్తే గీతా ఈ వారం నామినేషన్ నుండి బయటపడుతుంది అని అన్నారు బిగ్ బాస్ . అంతేకాదు బంపర్ ఆఫర్ తో తనకి ఇష్టమైన వ్యక్తిని సీజన్ మొత్తం నామినేట్ చేయోచ్చని పేర్కొన్నారు.రెండు రోజుల పాటు హంతుకలు ఎవరనే దాని కోసం ఓ రేంజ్లో ఇన్వెస్టిగేషన్ చేసిన రోల్ రైడా, గణేష్‌లు చివరికి హంతకుడు తనీష్ అని తేల్చి చెప్పారు. అంతక ముందు బెడ్‌పై గీతా పసుపు పడేయడంతో ఆమె పైన అనుమానం వ్యక్తం చేసిన తర్వాత తనీషే నిందితుడు అన్నారు. ఈ ఇన్వెస్టిగేషన్ ప్రక్రియలో బోనులో నిలుచోబెట్టి మరీ తనీష్, నూతన్ నాయుడు, గీతాలతో వాదోపవాదాలు జరిపారు. అయితే కొద్ది సేపటి తర్వాత బిగ్ బాస్ ఇన్వెస్టిగేషన్లో రోల్ రైడా, గణేష్‌లు విఫలమయ్యారని తెలియజేస్తూ సీక్రెట్ టాస్క్‌లని సక్సెస్ ఫుల్‌గా పూర్తి చేసినందుకు ఈ వారం నామినేషన్ నుండి గీతాకి మినహాయింపు ఇచ్చారు. ఇక సీజన్ మొత్తం ఎవరిని నామినేట్ చేస్తారని బిగ్ బాస్ గీతాని ప్రశ్నించగా, అందుకు మరోమారు ఆలోచించకుండా కౌశల్ పేరు చెప్పింది.గీతా .. కౌశల్‌ని నామినేట్ చేసేందుకు పలు కారణాలు ఉన్నాయని చెప్పుకొచ్చింది. మీరే గేమ్‌ని గేమ్‌లా ఆడమంటారు కదా అని కాస్త వెటకారంగా కూడా వ్యాఖ్యలు చేసింది. ఆ తర్వాత మీకు కౌశల్ ఆర్మీ ఉందిగా అంటూ గీతా మాధురి వ్యగ్యంగా మాట్లాడటంతో కొంత భావోద్వేగానికి గురయ్యాడు కౌశల్. ఆ సమయంలో నూతన్ నాయుడు కౌశల్ దగ్గరకి వచ్చి ధైర్యాన్ని అందించాడు. నీకు నేను అండగా ఉంటానంటూ బరోసా ఇచ్చాడు. ఇక ఈ వారం కెప్టెన్సీ టాస్క్‌లో తనీష్, రోల్ రైడా, నూతన్ నాయుడులని ఓటింగ్ ద్వారా ఎన్నుకున్నారు ఇంటి సభ్యులు .కెప్టెన్‌గా నిలిచేందుకు పోటీ దారులుగా ఉన్న ముగ్గురికి ‘అలసిపోతే అంతమే’.. అనే టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ లో భాగంగా ముగ్గురు ఆపకుండా సైకిల్ తొక్కాలి. అలసి పోకుండా చివరి వరకు ఎవరు ఉంటారో వారే ఈ వారం బిగ్ బాస్ హౌజ్ కెప్టెన్‌గా ఉంటారని చెప్పారు. ఈ టాస్క్‌లో మిగతా ఇంటి సభ్యులు పోటీ దారులకి తమ సపోర్ట్ అందించవచ్చు అని కూడా పేర్కొన్నారు . ఫిజికల్ టాస్క్ కావడంతో నూతన్ నాయుడు ఈ టాస్క్‌లో గెలిచే అవకాశాలు తక్కువగానే ఉన్నాయని తెలుస్తుంది. రోల్ రైడా, తనీష్‌లలో ఒకరు వచ్చే వారం బిగ్ బాస్ ఇంటికి కెప్టెన్ గా అవుతారని అంటున్నారు నెటిజన్స్. నేటి ఎపిసోడ్లో కెప్టెన్ ఎవరన్నది తెలియనుంది.