గీతా ఆర్ట్స్ బేన‌ర్‌లో సినిమా చేయ‌నున్న అఖిల్..!

Sun,February 17, 2019 08:25 AM

అక్కినేని నాగార్జున త‌న‌యుడు అఖిల్ మంచి హిట్ కొట్టాల‌నే క‌సితో ఉన్నాడు. రీసెంట్‌గా మిస్ట‌ర్ మ‌జ్ను చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రాగా,ఈ మూవీ క‌మ‌ర్షియ‌ల్‌గా మంచి విజ‌యం సాధించ‌లేక‌పోయింది. ఇక త్వ‌ర‌లో 'మలుపు’ ఫేమ్ సత్య ప్ర‌భాస్‌( ఆదిపినిశెట్టి సోద‌రుడు) తో త‌న‌ నాల్గవ చిత్రాన్ని అఖిల్ చేయనున్నట్టు స‌మాచారం. ఈ చిత్రం క్రీడా నేప‌థ్యంలో ఉంటుంద‌ట‌. ఇప్ప‌టికే చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ పూర్తి కాగా, ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుతున్నారు. మార్చిలో ఈ ప్రాజెక్ట్‌ని సెట్స్ పైకి తీసుకెళ్ళ‌నున్న‌ట్టు తెలుస్తుంది. అయితే టాలీవుడ్‌లో ఉన్న బ‌డా నిర్మాణ సంస్థ‌ల‌లో ఒక‌టైన గీతా ఆర్ట్స్‌లో అఖిల్ ఓ సినిమా చేసేందుకు సిద్ధంగా ఉన్న‌ట్టు తెలుస్తుంది. ఈ చిత్రాన్ని గీతా గోవిందం ఫేమ్ ప‌ర‌శురాం లేదా బొమ్మ‌రిల్లు భాస్కర్ తెర‌కెక్కించ‌నున్నార‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం ఈ ఇద్ద‌రు స్క్రిప్ట్ వ‌ర్క్స్‌తో బిజీగా ఉండ‌గా, నచ్చిన స్క్రిప్ట్‌తో ముందుకెళ్ళ‌నున్నాడు అఖిల్. మ‌రి దీనిపై క్లారిటీ ఎప్పుడొస్తుందో చూడాలి.

3437
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles