పేడ నీటిలో ప‌డుకున్న వ‌రుణ్‌.. కాక‌ర జ్యూస్ తాగిన రాహుల్

Tue,September 17, 2019 08:25 AM

బిగ్ బాస్ సీజ‌న్ 3 కార్య‌క్ర‌మం స‌క్సెస్‌ఫుల్‌గా ఎనిమిది వారాలు పూర్తి చేసుకుంది. ఈ సోమవారంతో తొమ్మిదో వారం మొద‌లైంది. అయితే ఎనిమిదో వారం ఇంటి నుండి ఎవ‌రు వెళ‌తారు అనే విష‌యంపై ముందుగానే వార్త‌లు వ‌చ్చాయి. శిల్పా చ‌క్ర‌వ‌ర్తి ఎలిమినేట్ అవుతుంద‌ని నెటిజ‌న్స్ అభిప్రాయ‌ప‌డ‌గా, అదే జ‌రిగింది. ఇప్పుడు ప్ర‌స్తుతం ప‌ది మంది ఇంటి స‌భ్యులు బిగ్ బాస్ ఇంట్లో ఉండ‌గా, 58వ ఎపిసోడ్‌లో నామినేష‌న్ ప్ర‌క్రియ జరిగింది.


గార్డెన్ ఏరియాలో టెలిఫోన్ బూత్ ఉండ‌గా, అందులో ఫోన్ రింగ్ కాగానే ఉరుక్కుంటూ వ‌చ్చి శ్రీముఖి లిఫ్ట్ చేసింది. దీంతో ఆమె నామినేట్ అయిన‌ట్టు బిగ్ బాస్ తెలిపారు. అయితే సేవ్ కావాలంటే బాబా భాస్క‌ర్ పూర్తి షేవ్ చేసుకోవ‌ల్సి ఉంటుంద‌ని బిగ్ బాస్ ఆమెకి చెప్పారు. ఇదే విష‌యాన్ని శ్రీముఖి.. బాబాకి చెప్ప‌గా ఆయ‌న అందుకు అంగీక‌రించి మీసాలు, గ‌డ్డం తీసేసాడు.దీంతో బాబా సరికొత్త లుక్‌లో ద‌ర్శ‌న‌మిస్తున్నాడు.

ఇక రెండో నామినేష‌న్‌లో భాగంగా పున‌ర్న‌వి టెలిఫోన్ బూత్‌లోకి వెళ్లింది. ఆమె నామినేష‌న్ అయిన విష‌యాన్ని తెలియ‌జేసిన బిగ్ బాస్‌, నువ్వు సేవ్ కావ‌లాంటే రాహుల్ 20 గ్లాసుల కాక‌ర జ్యూస్ తాగాల్సి ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. ఇదే విష‌యాన్ని పున్ను.. రాహుల్‌కి చెప్ప‌గా ఆయన అందుకు అంగీక‌రించాడు. మొద‌ట మూడు నాలుగు గ్లాసులు స్పీడ్‌గానే లాగించిన‌ప్ప‌టికి త‌ర్వాత చాలా క‌ష్ట‌మైంది. ఒకానొక స‌మ‌యంలో పూర్తిగా క‌క్కున్నాడు కూడా. అయిన‌ప్ప‌టికి ప‌ట్టు వద‌ల‌ని విక్ర‌మార్కుడిలా 20 గ్లాసుల జ్యూస్ తాగాడు. దీంతో పున్ను సేవ్ అయింది. అయితే త‌న‌కోసం అంత రిస్క్ చేసినందుకు గాను రాహుల్ని గ‌ట్టిగా హ‌గ్ చేసుకొని కిస్ ఇచ్చింది పున‌ర్న‌వి.

మూడో నామినేష‌న్‌లో భాగంగా వరుణ్ సందేశ్ బూత్‌లోకి వెళ్ళగా, నువ్వు సేవ్ కావాలంటే శ్రీముఖి బిగ్ బాస్ క‌న్ను టాటూ వేసుకోవ‌ల్సి ఉంటుంద‌ని బిగ్ బాస్ తెలిపారు. ఈ విష‌యాన్ని శ్రీముఖికి చెప్ప‌గా, నేను మ‌ళ్ళీ టాటూ వేసుకోవ‌ల్సి ఉంటే నా మొగుడి పేరే వేసుకుందామ‌ని అనుకున్నా అని చెప్పింది. అయితే వ‌రుణ్ కోసం త్యాగం చేసిన శ్రీముఖి త‌న చేతిపై బిగ్ బాస్ క‌న్ను టాటూ వేయించుకుంది. దీంతో వరుణ్ కూడా సేఫ్ అయ్యాడు.

నాలుగో నామినేష‌న్‌లో భాగంగా మ‌హేష్ బూత్‌లోకి వెళ్లాడు. నువ్వు సేవ్ కావాలంటే హిమ‌జ త‌న బ‌ట్ట‌ల‌తో పాటు మేక‌ప్ కిట్ అంతా స్టోర్ రూంలో పెట్టాల్సి ఉంటుంద‌ని బిగ్ బాస్ తెలిపాడు. అందుకు ఒప్పుకున్న హిమ‌జ కొన్నింటిని ఇంట్లో ఉంచి మిగ‌తా వాటిని స్టోర్ రూంలో పెట్టింది. స‌గం వ‌స్తువులు ఇంట్లోనే ఉంచిన కార‌ణంగా మ‌హేష్ ఈ వారం ఎలిమినేష‌న్‌కి నామినేట్ అయ్యాడు.

ఇక ఐదో నామినేష‌న్‌గా బాబా భాస్కర్ టెలిఫోన్ బూత్‌లోకి వెళ్ళాడు. అత‌ను సేవ్ కావాలంటే రవికృష్ణ త‌న షూస్ అన్నింటిని క‌ల‌ర్ నీళ్ళ‌లో ముంచాల్సి ఉంటుంద‌ని బిగ్ బాస్ పేర్కొన్నారు. ఇందుకు ఒప్పుకున్న ర‌వికృష్ణ త‌న షూస్ అన్నింటిని క‌ల‌ర్ నీళ్ళ‌ల్లో ముంచి బాబాని సేవ్ చేశారు. ఇక శివజ్యోతి ఎలిమినేష‌న్ నుండి సేవ్ కావాలంటే మ‌హేష్ త‌న జుట్టుకి ఎరుపు రంగు వేసుకోవ‌ల్సి ఉంటుంద‌ని బిగ్ బాస్ చెప్పారు. ఇందుకు మ‌హేష్ ఓకే అన‌డంతో శివ‌జ్యోతి కూడా సేవ్ అయింది.

హిమ‌జ విష‌యంలో స‌రికొత్త ట్విస్ట్ ఇచ్చారు బిగ్ బాస్. హిమ‌జ నువ్వు సేవ్ కావాలంటే త‌దుప‌రి ఆదేశం వ‌చ్చే వ‌ర‌కు వ‌రుణ్ సందేశ్ పేడ నీళ్ళు ఉన్న ట‌బ్‌లో ప‌డుకోవ‌ల్సి ఉంటుంద‌ని బిగ్ బాస్ పేర్కొన్నారు. ఈ విష‌యాన్ని వ‌రుణ్‌కి చెప్ప‌గా అత‌ను చేసేందుకు సిద్ద‌ప‌డ్డాడు. ట‌బ్‌లో ప‌డుకున్న వ‌రుణ్‌కి క‌డుపులో తిప్పి వాంతులు కూడా అయ్యాయి. అయిన‌ప్ప‌టికి ఎంతో క‌ష్టంగా అందులో అలానే ప‌డుకున్నాడు. ఆయ‌న బాధ‌ని చూడ‌లేక‌పోయిన హిమ‌జ‌ అందులో నుండి లేవ‌మ‌ని వరుణ్‌కి చెప్పింది. నువ్వు లేవ‌క‌పోతే నేను సెల్ఫ్ నామినేట్ చేసుకుంటాన‌ని అన్నది. ప‌ర్లేదు అని చెప్పిన వ‌రుణ్ అందులో అలానే ప‌డుకొని ఉన్నాడు. ఎట్ట‌కేల‌కి వ‌రుణ్ త‌న టాస్క్ స‌క్సెస్ ఫుల్‌గా పూర్తి చేయ‌డంతో హిమ‌జ సేఫ్ అయిన‌ట్టు బిగ్ బాస్ తెలిపాడు.ఈ రోజు మిగ‌తా ఇంటి స‌భ్యులు సేవ్ అయ్యేందుకు బిగ్ బాస్ ఎలాంటి టాస్క్‌లు ఇస్తాడో చూడాలి.

4817
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles