'గాయ‌త్రి' టీజ‌ర్‌తో అల‌రించిన మోహ‌న్ బాబు

Sat,January 13, 2018 03:13 PM
Gayatri Official Teaser

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఎనర్జీ అప్పటికి ఇప్పటికి అలానే ఉంది. కొంతకాలంగా లీడ్ రోల్ కి దూరంగా వుంటున్న మోహన్ బాబు ఇప్పుడు మరోసారి కలెక్షన్ కింగ్ అని నిరూపించుకోవడానికి వచ్చేస్తున్నాడు. మోహన్ బాబు చివరగా 'రౌడీ' అనే సినిమాలో లీడ్ రోల్ చేశాడు ఆ తర్వాత మామ మంచు అల్లుడు కంచులో కీలకమైన పాత్రలో కనిపించాక మళ్ళీ తెరమీదకి రాలేదు. ఇప్పుడు మళ్లీ ఆయన కథానాయకుడిగా గాయత్రి సినిమా తెరకెక్కుతోంది. 'పెళ్లైన కొత్తలో' ఫేమ్ మదన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో మోహన్ బాబుకు కూతురిగా నిఖిల న‌టిస్తుంది. మంచు విష్ణు, శ్రేయ ముఖ్య పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నారు.

గాయత్రి చిత్రంలో మోహన్ బాబు డబుల్ యాక్షన్ చేయనున్నాడు. అందులో ఒకటి హీరో పాత్ర అయితే.. ఇంకోటి విలన్ క్యారెక్టర్ అని తాజాగా విడుద‌లైన టీజ‌ర్‌ని బట్టి తెలుస్తుంది. రామాయ‌ణంలో రాముడికి, రావ‌ణాసురుడికి గొడ‌వ‌.. మ‌హా భార‌తంలో పాండ‌వుల‌కి , కౌర‌వుల‌కి గొడ‌వ అని చెబుతూ పుర‌ణాల‌లో వాళ్ళు చేసింది త‌ప్పే అయితే నేను చేసింది త‌ప్పే, అక్క‌డ వాళ్ళు దేవుళ్ళు అయితే ఇక్క‌డ నేను దేవుడినే. అర్ధం చేసుకుంటారో , అపార్థం చేసుకుంటారో .. చాయిస్ ఈజ్ యువ‌ర్స్ అంటూ టీజ‌ర్‌లో ప‌వ‌ర్‌ఫుల్ డైలాగ్స్ పేల్చాడు మోహ‌న్ బాబు. హీరోగా.. విలన్ గా గొప్ప గొప్ప పాత్రలు చేసిన మోహన్ బాబు.. ఒకే సినిమాలో ఇలా రెండు రకాల షేడ్స్ ఉన్న క్యారెక్టర్లు చేయడం అందరికి ఇంట్రస్టింగ్ గా వుంది. ఫిబ్ర‌వ‌రి 9న విడుద‌ల కానున్న ఈ సినిమాకి సంబంధించి తాజాగా విడుద‌లైన టీజ‌ర్ పై మీరు ఓ లుక్కేయండి.

1614
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles