హీరోగా మార‌నున్న స్టార్ డైరెక్ట‌ర్..!

Tue,August 7, 2018 01:16 PM
gautham menon next to be hero on silver screen

ప్ర‌స్తుతం ట్రెండ్ మారింది. ఇండ‌స్ట్రీకి సంబంధించి వివిధ రంగాల‌లో ఉన్న వారు వేరే రంగంలోను రాణించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ క్ర‌మంలో హీరోలు ద‌ర్శ‌కులు అవుతున్నారు. ద‌ర్శ‌కులు హీరోలుగా మారుతున్నారు. ప్రేమ క‌థా చిత్రాలకి కేరాఫ్ అడ్రెస్ అయిన గౌత‌మ్ మీనన్ త్వ‌ర‌లో క‌థానాయ‌కుడిగా ప‌రిచ‌యం కానున్న‌ట్టు తెలుస్తుంది. ఎన్నో ప్రేమ క‌థా చిత్రాల‌తో ఎంద‌రో హీరోల‌ని ప‌రిచ‌యం చేసిన గౌత‌మ్ మీన‌న్ ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇవ్వ‌డం ఖాయం అంటున్నారు కోలీవుడ్ మీడియా. ‘జై’ అనే కొత్త దర్శకుడు ఇటీవ‌ల గౌత‌మ్ మీన‌న్‌ని క‌లిసి అద్భుత‌మైన క‌థ వినిపించార‌ట‌. ఈ క‌థ ఎంత‌గానో న‌చ్చ‌డంతో క‌థానాయ‌కుడిగా సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ట‌. ఈ మూవీ ఆగ‌స్ట్ 15న పూజా కార్య‌క్ర‌మాలు జ‌రుపుకోనుంది .ఇందులో ‘నాచ్చియార్‌’ ఫేమ్‌ నాయిక ఇవానా ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. క‌థానాయిక‌గా ఎవ‌రిని ఎంపిక చేయ‌నున్నార‌నే వివ‌రాలు తెలియాల్సి ఉంది. ద‌ర్శ‌కుడిగా, నిర్మాత‌గా త‌న టాలెంట్‌ని ప్రూవ్ చేసుకున్న గౌత‌మ్ మీన‌న్ హీరోగా ఎలా అల‌రిస్తాడో చూడాలి. ఆయ‌న త్వ‌ర‌లో అనుష్క ప్ర‌ధాన పాత్ర‌లో ఓ మూవీ డైరెక్ట్‌ చేయ‌నున్న‌ట్టు టాక్.

3794
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles