మొరాకోలో బాలయ్య టీం

Tue,May 10, 2016 10:49 PM
GautamiPutra Satakarni team in Morocco


హైదరాబాద్: టాలీవుడ్ నటుడు బాలకృష్ణ గౌతమీ పుత్ర శాతకర్ణి మూవీతో బిజీబిజీగా ఉన్నారు. క్రిష్ దర్శకత్వంలో బాలయ్య వందో మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం చిత్ర యూనిట్ మొరాకో వెళ్లింది. ఫైట్ మాస్టర్లు రామ్ లక్ష్మణ్ పర్యవేక్షణలో ప్రస్తుతం యుద్ద సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

ఈ విషయమై క్రిష్ మాట్లాడుతూ మొరాకోలో 3వారాల పాటు షూటింగ్ కొనసాగుతుంది. హాలీవుడ్ స్థాయికి ఏ మాత్రం తగ్గకుండా హాలీవుడ్ టెక్నీషియన్స్ సాయంతో సినిమాను రూపొందిస్తున్నాం. తొలి రోజు సన్నివేశాలు అంచనాలకు మించి రావడంతో చిత్ర యూనిట్ సంతోషంగా ఉందని చెప్పారు.

1698
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles