'సంజూ' చిత్రంపై గ్యాంగ్‌స్ట‌ర్ ఫైర్‌

Fri,July 27, 2018 01:33 PM
Gangster Abu Salem sends notice to  Sanju producers

బాలీవుడ్ స్టార్ సంజయ్ ద‌త్ జీవిత నేప‌థ్యంలో తెర‌కెక్కిన సంజూ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద జెట్ స్పీడ్‌తో దూసుకెళుతుంది. ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ మూవీకి 500 కోట్ల‌కి పైగా వ‌సూళ్ళు ల‌భించాయి. అయితే ఈ చిత్రానికి ప్ర‌శంల‌స‌తో పాటు విమ‌ర్శ‌లు రావ‌డం విశేషం. అండర్‌వరల్డ్‌ అంటూ సంజయ్ దత్ అవలక్షణాలను పొగుడుతూ మూవీ తీసిన‌ట్టుగా సంజూ చిత్రం ఉంద‌ని కొన్ని ప‌త్రిక‌లు రాశాయి. అయితే ఈ సినిమాలో కొన్ని సీన్స్ నా ప‌రువుకి న‌ష్టం క‌లిగించేలా ఉన్నాయి. 15 రోజులలో ఆ సీన్స్ సినిమా నుండి తీసేయాలి లేదంటే చ‌ట్ట‌ప‌రంగా చర్య‌లు త‌ప్ప‌వంటూ త‌న లాయర్ ద్వారా సంజూ నిర్మాత‌ల‌కి, ద‌ర్శ‌కుల‌కి, ఫాక్ట్స్ స్టార్ స్టూడియోల‌కి నోటీసులు పంపారు గ్యాంగ్ స్ట‌ర్ అబూ స‌లేం.

1993వ సంవత్స‌రం అప్పుడు జ‌రిగిన బాంబ్ బ్లాస్ట్ లో సంజ‌య్ ద‌త్‌కి అబూ స‌లేం ఆయుధాలు, మందుగుడు సామాగ్రి స‌ర‌ఫ‌రా చేసిన‌ట్టు చూపించారు. అస‌లు నా క్లైంట్ (అబూ స‌లేం) సంజ‌య్ ద‌త్‌ని ఒక్క‌సారి క‌ల‌వ‌లేదు, ఆయుదాలు స‌ర‌ఫ‌రా చేయ‌లేదు. అలాంట‌ప్పుడు సినిమాలో అబూ అలా చేశాడ‌ని ఎలా చూపిస్తారంటూ అబూ స‌లేం న్యాయ‌వాది ప్ర‌శాంత్ పాండే త‌న నోటీసులో పేర్కొన్నారు. ముంబై అల్లర్ల కేసులో ప్రధాన నిందితుడైన అబూ సలేంను దోషిగా నిర్ధారించిన టాడా ప్రత్యేక న్యాయస్థానం జీవిత ఖైదు విధించిన విషయం తెలిసిందే. మ‌రి త‌న పరువుకు భంగం క‌లిగింద‌ని అబూ స‌లేం ఆరోపిస్తున్న నేప‌థ్యంలో సంజు చిత్ర నిర్మాతలు ఆ స‌న్నివేశాలు తొల‌గిస్తారో లేదో చూడాలి.

1811
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles