జగ్గూభాయ్ 'గ్యాంగ్ స్టార్స్' వెబ్ సిరీస్ టీజర్ విడుదల

Fri,May 18, 2018 03:51 PM
GangStars   Official Teaser

ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా అలరించిన జగపతి బాబు ఆ తర్వాత సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేస్తూ వస్తున్నాడు. లెజెండ్ చిత్రంలో విలన్ పాత్ర పోషించిన జగపతి బాబు అందులో తన నట విశ్వరూపం కనబరిచాడు. దీంతో ఆయన సెకండ్ ఇన్నింగ్స్ మొదలైంది. ప్రస్తుతం ఆయన కాల్షీట్స్ ఏ మాత్రం ఖాళీ లేవు. త్వరలో బాలీవుడ్ కి కూడా వెళ్ళనున్నాడు జగ్గూ భాయ్. అయితే రీసెంట్ గా వెబ్ సిరీస్ లోను నటిస్తున్నాడు. డార్క్ కామెడీగా తెరకెక్కుతున్న గ్యాంగ్ స్టార్స్ అనే వెబ్ సిరీస్ లో జగపతి బాబు గూండా కృష్ణ దాస్ అనే పాత్ర పోషిస్తున్నారు. నందిని రెడ్డి దర్శకత్వ పర్యవేక్షణలో దడ ఫేం అజయ్ భూయాన్ ఈ వెబ్ సిరీస్ ని డైరెక్ట్ చేస్తున్నాడు. శ్వేత బసు ప్రసాద్, నవదీప్, పోసాని కృష్ణ మురళి, శివాజీ కీలక పాత్రలలో నటిస్తున్నారు. జూన్ 1 న అమెజాన్ ప్రైమ్ వీడియోలో తొలి ఎపిసోడ్ రిలీజ్ కానుండగా, మొత్తం 12 ఎపిసోడ్స్ గా తెలుగు, తమిళం, హిందీ భాషలలో రిలీజ్ కానుంది. తాజాగా గ్యాంగ్ స్టర్స్ ప్రోమో వీడియో విడుదల చేశారు. ఇది సినీ ప్రేక్షకులని అలరిస్తుంది. నేనే రాజు నేనే మంత్రి సినిమాకు కథ సహకారాన్ని అందించిన రచయిత లక్ష్మీ భూపాల ఈ వెబ్ సిరీస్ కోసం కథతో పాటు స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు.2168
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles