స‌రిలేరు నీకెవ్వ‌రు టీంతో గంగ‌వ్వ మాట ముచ్చ‌ట‌

Sat,December 14, 2019 07:52 AM

అతి త‌క్కువ టైంలో యూ ట్యూబ్‌లో సెన్సేష‌న‌ల్ స్టార్‌గా మారిన గంగ‌వ్వ తాజాగా స‌రిలేరు నీకెవ్వ‌రు ప్ర‌మోష‌న్‌లో భాగంగా చిత్ర బృందాన్ని క‌లిసింది. ద‌ర్శ‌కుడు అనీల్ రావిపూడితో పాటు చిత్ర‌బృందాన్ని క‌లిసి ప‌లు ప్ర‌శ్న‌లు వేసింది. సినిమాకి సంబంధించిన అనేక ఆస‌క్తిర విష‌యాలు అడిగి తెలుసుకుంది. గంగ‌వ్వ‌తో స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్ర బృందం జ‌రిపిన ఫ‌న్నీ ముచ్చ‌ట్లకి సంబంధించిన వీడియోని తాజాగా విడుద‌ల చేశారు. ఈ వీడియో నెటిజ‌న్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది.


మ‌హేష్ బాబు, ర‌ష్మిక ప్ర‌ధాన పాత్ర‌లో అనీల్ రావిపూడి తెర‌కెక్కిస్తున్న చిత్రం స‌రిలేరు నీకెవ్వ‌రు. విజ‌య‌శాంతి ముఖ్య పాత్ర‌లో క‌నిపించి సంద‌డి చేయ‌నున్నారు. ఇటీవ‌ల చిత్ర టీజ‌ర్ విడుద‌ల కాగా, ఈ టీజ‌ర్ ప్రేక్ష‌కుల‌లో మూవీపై అంచ‌నాలు పెంచింది. దేవి శ్రీ సంగీతం కూడా ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తుంది. సంక్రాంతి కానుక‌గా జ‌నవ‌రి 11న విడుద‌ల కానున్న ఈ చిత్రంలో మ‌హేష్ బాబు మేజ‌ర్ అజ‌య్ కృష్ణ పాత్ర‌లో క‌నిపించి సంద‌డి చేయ‌నున్నారు.

1015
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles