గంగ‌వ్వ‌తో 'స‌రిలేరు నీకెవ్వ‌రు' టీం

Sun,December 8, 2019 10:09 AM

ప్ర‌స్తుతం యూట్యూబ్‌లో సెన్సేష‌న్‌గా మారిన గంగ‌వ్వ మెల్ల‌మెల్ల‌గా వెండితెర‌పై కూడా ఓ వెలుగు వెలిగేందుకు స‌న్న‌ద్ధ‌మవుతుంది. ఇటీవ‌ల ఇస్మార్ట్ శంక‌ర్ చిత్రంలో ఓ మెరిసిన గంగ‌వ్వ స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రంలో కూడా క‌నిపించ‌నున్న‌ట్టు తెలుస్తుంది. అయితే ప్ర‌స్తుతం యూట్యూబ్‌లో గంగ‌వ్వ కామెడీల‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. అచ్చ తెలంగాణ‌లో ముక్కుసూటిగా మాట్లాడే గంగ‌వ్వకి ప్ర‌తి ఒక్క‌రు బాగా క‌నెక్ట్ అయ్యారు. ఈ నేప‌థ్యంలో సినీ ప్ర‌ముఖులు కూడా ఆమెతో మూవీ ప్ర‌మోష‌న్ చేయించుకుంటున్నారు. ఆ మ‌ధ్య ఓ బేబి సినిమా ప్ర‌మోష‌న్ కోసం గంగ‌వ్వ స‌మంత‌ని ఇంట‌ర్వ్యూ చేసింది. ఇద్ద‌రి మ‌ధ్య జ‌రిగిన ఫన్నీ ఇంట‌ర్వ్యూ నెటిజ‌న్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. ఇక తాజాగా స‌రిలేరు నీకెవ్వ‌రు ప్ర‌మోష‌న్‌లో భాగంగా గంగవ్వ టీం చిత్ర బృందాన్ని క‌లిసింది. మ‌హేష్‌, విజ‌య‌శాంతి, రాజేంద్ర‌ప్రసాద్‌, అనీల్‌రావిపూడితో క‌లిసి ఫోటోలు దిగారు. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు వైర‌ల్‌గా మారాయి.
1407
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles