'గ్యాంగ్' కోసం స్వ‌యంగా డ‌బ్బింగ్ చెప్పిన సూర్య‌

Thu,December 14, 2017 11:03 AM
gang teaser released

త‌మిళ న‌టుడు సూర్య‌కి త‌మిళంలోనే కాదు తెలుగులోను మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సూర్య చేసిన చిత్రాల‌న్నీ దాదాపు తెలుగులో విడుద‌ల అవుతుంటాయి. ప్ర‌స్తుతం విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో తానా సెరిందా కూట్టం అనే చిత్రాన్ని చేస్తున్నాడు సూర్య . తెలుగులో ఈ మూవీ గ్యాంగ్ అనే పేరుతో రిలీజ్ కానుంది. యాక్షన్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తుంది. ఇందులో రమ్యకృష్ణ, సెంధిల్ ముఖ్య పాత్రలు పోషించగా స్టూడియో గ్రీన్ బేనర్ పై సత్యన్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. యంగ్ టాలెంట్ అనిరుధ్ రవిచంద్రన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.

సంక్రాంతికి తానా సెరిందా కూట్టం చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తేవాలని టీం భావిస్తుండ‌గా, కొన్ని రోజుల క్రితం త‌మిళ‌ చిత్ర టీజ‌ర్ విడుద‌ల చేశారు. కాని తెలుగు టీజ‌ర్ విడుద‌ల చేయ‌లేదు. తాజాగా తెలుగు టీజ‌ర్ విడుద‌ల చేయ‌గా, ఇందులో సూర్య త‌న పాత్ర‌కి స్వ‌యంగా డ‌బ్బింగ్ చెప్పుకున్నాడ‌ని తెలుస్తుంది. చాలా రోజులపాటు తెలుగును ప్రాక్టీస్ చేయడం వలన ఉచ్ఛరణతో పాటు డైలాగ్ డెలివ‌రీ కూడా బాగుంద‌ని ప‌లువురు చెబుతున్నారు. టీజ‌ర్‌ని బ‌ట్టి చూస్తుంటే ఈ సినిమాలో హీరో సూర్య ఒక పోలీస్ పాత్రను కాకుండా.. సిబిఐ ఆఫీసర్ తరహాలోను చేస్తున్నాడ‌ని తెలుస్తుంది. తానా సెరిందా కూట్టం చిత్రం హిందీలో అక్షయ్ కుమార్ హీరోగా నటించిన స్పెషల్ ఛబ్బీస్ కి రీమేక్ కాగా, తెలుగులో యూవీ క్రియేషన్స్ ఈ మూవీని విడుద‌ల చేయ‌నుంది.

1308
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles