సాహోకి సైడ్ ఇచ్చిన నాని.. సెప్టెంబ‌ర్‌లో సంద‌డికి సిద్ధం

Fri,August 9, 2019 12:12 PM

నేచుర‌ల్ స్టార్ నాని చాలా విష‌యాల‌లో కాంప్ర‌మైజింగ్‌గా ఉంటారు. ఎవ‌రితో పోటీ ప‌డ‌కుండా ప‌రిస్థితుల‌కి అనుకూలంగా త‌న సినిమాలు విడుద‌ల చేసి మంచి విజ‌యం సాధిస్తున్నారు. ప్ర‌స్తుతం విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో గ్యాంగ్ లీడ‌ర్ అనే సినిమా చేస్తున్నాను నాని. ఈ చిత్రంలో నాని సరసన ప్రియాంకా అరుళ్ మోహన్ నటిస్తుండగా, ఆర్ఎక్స్ 100′ హీరో కార్తికేయ నెగిటివ్ రోల్ లో నటిస్తున్నాడు. అలాగే ఇతర కీలక పాత్రల్లో లక్ష్మి, శరణ్య, అనీష్ కురువిళ్లా, ప్రియదర్శి, రఘుబాబు ,వెన్నెల కిషోర్, సత్య నటిస్తున్నారు. అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.


ఆగ‌స్ట్ 30న గ్యాంగ్ లీడ‌ర్ చిత్రాన్ని విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ భావించిన‌ప్ప‌టికి, అదే రోజు సాహో చిత్రం విడుద‌ల కానుండ‌డంతో తమ చిత్రాన్ని వాయిదా వేసుకున్నారు. సాహో సినిమా మ‌నంద‌రి సినిమా. ఈ సినిమా స‌క్సెస్ అయితే మ‌నం సంబ‌రాలు చేసుకుంటాం. ఈ సినిమా త‌ప్ప‌క బ్లాక్ బ‌స్ట‌ర్ అవుతుంద‌ని నాని త‌న ట్వీట్‌లో తెలిపారు. అంటే ప్ర‌భాస్ కోసం త‌న సినిమాని వాయిదా వేసుకొని సెప్టెంబ‌ర్ 13న రిలీజ్ చేసేందుకు సిద్ద‌మ‌య్యాడు. సెప్టెంబ‌ర్ లో వ‌చ్చిన అష్టా చెమ్మా, భ‌లేభ‌లే మ‌గాడివోయ్ చిత్రాలు మంచి విజ‌యం సాధించ‌డంతో ఈ చిత్రం కూడా హిట్ కొట్ట‌డం ఖాయం అని అంటున్నారు. అయితే తోటి హీరో పట్ల నాని ప్రదర్శించిన స్నేహ భావానికి ఆయ‌న‌పై నెటిజ‌న్స్ ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ఇటీవ‌ల గ్యాంగ్ లీడ‌ర్ టీజ‌ర్ విడుద‌ల కాగా ఇందులో పెన్సిల్ పార్ధ‌సార‌ధి పాత్ర‌లో నాని క‌నిపించారు. ఆయ‌న ఫేమ‌స్ రివెంజ్ రైట‌ర్ అని ప‌రిచ‌యం చేసుకుంటాడు. పెన్సిల్‌, అత‌ని గ్యాంగ్ చేసే సంద‌డి సినిమాపై ఆస‌క్తిని క‌లిగించింది.

999
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles