బిగ్ బాస్ హౌజ్‌లో వినాయ‌క చ‌వితి సంబురాలు

Sat,September 15, 2018 08:35 AM
Ganesh Chaturthi Celebrations in bigg boss house

బిగ్ బాస్ సీజ‌న్ 2 ఎపిసోడ్ 97కి చేరింది. ఈ ఎపిసోడ్‌లో బిగ్ బాస్ ఇంటి స‌భ్యుల‌కి నూత‌న్ వ‌స్త్రాలతో పాటు పూలు, పండ్లు, స్వీట్స్ పంపి వినాయ‌క‌చ‌వితి వేడుక‌ని ఘ‌నంగా జ‌రుపుకోమ‌ని చెప్పారు. అంతేకాదు వ‌స్త్రాలు ధ‌రించిన త‌ర్వాత ఒక్కొక్క‌రు కెమెరా ముందుకు వ‌చ్చి వారి కోరిక‌లు తెలియ‌జేసి ఆ త‌ర్వాత ఇంటి స‌భ్యుల‌కి, స‌న్నిహితుల‌కి, ప్రేక్ష‌కుల‌కి వినాయ‌క చవితి శుభాకాంక్ష‌లు తెల‌పాల‌ని చెప్పారు. ఈ క్ర‌మంలో అందంగా రెడీ అయిన ఇంటి స‌భ్యులు ఇంటిని కూడా అందంగా అలంక‌రించి శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. అంత‌కముందు కెమెరా గార్డ్ ప‌గ‌ల‌గొట్టిన కార‌ణంగా దీప్తికి జైలు శిక్ష విధించిన బిగ్ బాస్ ఈ ఎపిసోడ్‌లో ముగింపు ప‌లికారు. ఇక‌నైనా బిగ్ బాస్ రూల్స్ స‌క్ర‌మంగా ఫాలో కావాల‌ని హెచ్చ‌రించారు.

త‌ను, సామ్రాట్‌ల మ‌ధ్య క్లోజ్‌నెస్‌పై గీతా మాధురి క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేసింది. నేను అంద‌రితో ఒకేలా ఉన్నా కూడా సామ్రాట్‌తో పాంప‌ర్ చేస్తున్నార‌ని కౌశ‌ల్ గారు అన్న కార‌ణంగానే అంద‌రు అలా భావిస్తున్నారేమో అంటూ దీప్తితో చెప్పుకొచ్చింది గీతా. అయితే గీత ఛాయిస్ ఎప్పుడూ రాంగ్ కాదని నందూకి ఉంది. మా క్లారిటీ మాకు ఉందంటూ త‌న‌పై వ‌చ్చిన నింద‌లు తొల‌గించుకునే ప్ర‌య‌త్నం చేసింది. ఇక సామ్రాట్‌ని నీ ఫేవ‌రేట్ సోఫాలో కూర్చోమ‌ని గీతా చెబుతూ ఈ మ‌ధ్య సోఫాను బొత్తిగా మ‌ర్చిపోయారు. ఇక్క‌డే కూర్చునేవారు కదా అంటూ తేజ‌స్వినీతో సామ్రాట్ గ‌డిపిన పాత జ్ఞాప‌కాలు గుర్తు చేసింది గీతా. దీనిపై సామ్రాట్ త‌న‌దైన శైలిలో స్పందించాడు. ఈ సోఫా గురించి ఇద్ద‌రి మ‌ధ్య చాలాసేపే చర్చ న‌డిచింది.

ఇక వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా బిగ్ బాస్ ఇంట్లోకి చిన్న పిల్ల‌లు అతిధిగా హాజ‌ర‌య్యారు. స్త్రీ ఔన్న‌త్యాన్ని చాటి చెప్పేందుకు మా టీవి వారు తులాభారం కాంటెస్ట్ నిర్వ‌హించారు. ఇందులో గెలుపొందిన ప‌ది మందికి సంవ‌త్స‌రం పాటు ఉచిత విద్య అందించ‌నున్న‌ట్టు బిగ్ బాస్ లేఖ‌లో తెలిపారు. ఇక అతిధులుగా రానున్న ప‌ది మందికి అతిధి మ‌ర్యాద‌లు చేయాలని బిగ్ బాస్ ఇంటి స‌భ్యుల‌ని ఆదేశించారు. ఇంట్లోకి వ‌చ్చిన పిల్ల‌ల‌కి పూల‌తో స్వాగ‌తం ప‌లికారు హౌజ్‌మేట్స్. ఆ త‌ర్వాత పిల్ల‌లు ఒక్కొక్క‌రుగా వారిని ప‌రిచ‌యం చేసుకున్నారు. ఇంటి స‌భ్యుల‌తో క‌లిసి దాగుడుమూతలు ఆడారు. గార్డెన్ ఏరియాలో డ్యాన్స్ లు చేసారు. ఆ త‌ర్వాత కంటెస్టెంట్స్ నుండి స‌ర్టిఫికెట్స్ అందుకున్నారు. పిల్లలు వెళ్లిన త‌ర్వాత ఇంటి స‌భ్యులు ర‌కార‌కాల పిండి వంట‌కాలు వండుకొని డేని స‌ర‌దాగా గ‌డిపారు. గార్డెన్ ఏరియాలో వినాయ‌కునికి సంబంధించిన పాట‌ల‌కి స్టెప్పులు వేశారు. ఈ క్ర‌మంలో బిగ్ బాస్ హౌస్‌లో పండగ వాతావరణం నెలకొంది. దీంతో 97వ ఎపిసోడ్ ముగిసింది.

3347
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles