స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2 ట్రైలర్‌.. టైగర్‌ ష్రాఫ్‌ను ఆడుకుంటున్న నెటిజన్లు

Sat,April 13, 2019 11:49 AM
Funny tweets on Tiger Shroff after release of Student Of The Year 2 Trailer

స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2 ట్రైలర్‌ నిన్న రిలీజ్‌ అయింది కదా. ట్రైలర్‌ బాగానే ఉంది కానీ.. టైగర్‌ ష్రాఫ్‌ను మాత్రం నెటిజన్లు ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు. టైగర్‌ ష్రాఫ్‌ అంటేనే ఎగరడం, దూకడం, డ్యాన్స్‌ చేయడం, స్టంట్స్‌ చేయడం. అవే ఆయనకు తెలిసింది. అందుకే టైగర్‌ ష్రాఫ్‌ నటించిన ఏ సినిమా తీసుకున్నా ఇవే కనిపిస్తాయి.

అలాగే స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2 ట్రైలర్‌లోనూ టైగర్‌ ష్రాఫ్‌ దూకడం, ఎగరడం, ఫైటింగ్‌ సీన్లలో జంప్‌ చేస్తూ వేరే వాళ్లను కొట్టడం కనిపిస్తాయి. అంతే.. ఇక నెటిజన్లు ఊరుకుంటారా? ఇది స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2 కాదు.. దీనికి ఫ్లయింగ్‌ జాట్‌ 2 అనే పేరు పెట్టాలి అంటూ కామెంట్‌ చేయడం, ముఖ్యంగా ఓ సీన్‌లో టైగర్‌ స్పైడర్‌ మ్యాన్‌ డ్రెస్‌ వేసుకోవడం, తారా సుతారియా ఏమో వండర్‌ ఉమెన్‌ డ్రెస్‌ వేసుకోవడం చూసి స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2 డీసీ, మార్వెల్‌ సినిమాలకు తాతలా ఉంది అంటూ ట్వీట్లు చేస్తున్నారు. అంతే కాదు.. ట్రైలర్‌ నుంచి రకరకాల మీమ్స్‌ తయారు చేసి టైగర్‌ ష్రాఫ్‌తో ఆడుకుంటున్నారు. ఇదివరకు కూడా ఈ సినిమాలోని హీరోయిన్స్‌ వేసుకున్న డ్రెస్సులపై నెటిజన్లు ఫైరయ్యారు. మళ్లీ ఇప్పుడు ఇలా టైగర్‌ పై మీమ్స్‌తో చెలరేగిపోతున్నారు. దీంతో సోషల్‌ మీడియాలో స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2 ట్రైలర్‌ గురించే చర్చ. ఫన్నీ ట్వీట్లలో వైరలవుతున్న కొన్ని ట్వీట్లు ఇవే.


1729
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles