సంక్రాంతి బ‌రిలో పోటి ప‌డేందుకు సిద్ధ‌మైన పందెం కోళ్ళు

Tue,January 8, 2019 09:45 AM
four movies in pongal fight

సంక్రాంతికి కోళ్ల పందేల‌ హంగామా ఏ రేంజ్‌లో ఉంటుందో , అలానే థియేట‌ర్స్‌లో స్టార్ హీరోల సినిమాల మ‌ధ్య పోటీ కూడా అంతే ఆస‌క్తికరంగా ఉంటుంది. ఈ సారి బాక్సాఫీస్ వ‌ద్ద నాలుగు పెద్ద సినిమాలు పోటి ప‌డుతున్నాయి. సంక్రాంతికి త‌న ప్ర‌తి సినిమాని విడుద‌ల చేసి మంచి విజ‌యం సాధిస్తున్న బాల‌కృష్ణ ఈ సంక్రాంతికి కూడా వ‌స్తున్నాడు. త‌న తండ్రి జీవిత నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఎన్టీఆర్‌- క‌థానాయకుడు చిత్రంతో జ‌న‌వ‌రి 9న ప‌ల‌క‌రించ‌బోతున్నాడు. ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఇక ఇటీవ‌ల 2.0 చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని అలరించిన ర‌జ‌నీకాంత్ పేట చిత్రంతో జ‌న‌వ‌రి 10న ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించ‌నున్నాడు. చిత్రానికి సంబంధించి విడుద‌లైన స్టిల్స్‌, ట్రైల‌ర్ చూస్తుంటే ఈ చిత్రం మంచి హిట్ కొట్ట‌డం ఖాయ‌మని అభిమానులు భావిస్తున్నారు.

రంగ‌స్థ‌లంతో త‌న న‌ట విశ్వ‌రూపం చూపించిన రామ్ చ‌ర‌ణ్ ఈ సంక్రాంతికి విన‌య విధేయ రామ అనే మాస్ ఎంట‌ర్‌టైన‌ర్‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు. బోయ‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమాపై కూడా ఓ రేంజ్ ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉన్నాయి. ఈ చిత్రం జ‌న‌వ‌రి 11న విడుద‌ల కానుంది. ఇక మ‌ల్టీ స్టార‌ర్స్‌కి కేరాఫ్ గా మారిన విక్ట‌రీ వెంక‌టేష్ ..మెగా హీరో వ‌రుణ్ తేజ్‌తో క‌లిసి ఎఫ్ 2 చిత్రం చేశాడు. కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ చిత్రం ప‌క్కా హిట్ కొడుతుంద‌ని అభిమానులు ఆశాభావం వ్య‌క్తం చేస్తున్నారు. అజిత్ న‌టించిన విశ్వాసం కూడా సంక్రాంతికి త‌మిళంలో విడుద‌ల కానుంది. తెలుగులో కొద్ది రోజుల త‌ర్వాత విడుద‌ల చేయాల‌ని భావిస్తున్నారు. మ‌రి ఈ సంక్రాంతి పందెం కోళ్ళ‌లో విజ‌యం ఎవ‌రిని ఎక్కువ‌గా వ‌రిస్తుందో చూడాలి.

2543
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles