బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పోటీ ప‌డ‌నున్న నాలుగు సినిమాలు

Thu,August 23, 2018 10:31 AM
four movies big fight on box office

ఈ ఏడాది ప్ర‌థ‌మార్ధంలో టాలీవుడ్ సినిమాలు బాక్సాఫీస్‌ని షేక్ చేసిన సంగ‌తి తెలిసిందే. రంగ‌స్థ‌లం, భ‌ర‌త్ అనే నేను , మ‌హానటి వంటి బ‌డా చిత్రాలు కాసుల వ‌ర్షం కురిపించాయి. ఇక ద్వితీయార్ధంలో పెద్ద సినిమాల హ‌డావిడి ఏమి లేక‌పోయిన చిన్న సినిమాలు మాత్రం అభిమానుల‌కి ప‌సందైన విందు అందిస్తున్నాయి. ఆర్ ఎక్స్ 100, గూఢాచారి, చిల‌సౌ, గీత గోవిందం వంటి చిత్రాలు ఇటీవల విడుద‌లై భారీ విజ‌యాన్ని సాధించాయి. ఇక ఈ శుక్ర‌వారం( ఆగ‌స్ట్ 24)న నాలుగు సినిమాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకునేందుకు సిద్ధ‌మ‌య్యాయి. ఆట‌గాళ్ళు, నీవెవ‌రో, ల‌క్ష్మీ, అంత‌కుమించి చిత్రాలు రేపు గ్రాండ్‌గా విడుద‌ల కాబోతున్నాయి. నారా రోహిత్‌, జ‌గ‌ప‌తి బాబు ప్ర‌ధాన పాత్ర‌లో ఆట‌గాళ్ళు తెర‌కెక్క‌గా, ఆది పినిశెట్టి, తాప్సీ, రితికా సింగ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో నీవెవ‌రో చిత్రం రూపొందింది. ఈ రెండు సినిమాల‌పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ప్ర‌భుదేవా న‌టించిన ల‌క్ష్మీ చిత్రంపై కూడా అభిమానుల‌లో ఆస‌క్తి నెల‌కొంది. ఇక హీరోయిన్‌గా త‌న అదృష్టం పరీక్షించుకుంటున్న ర‌ష్మీ అంత‌కు మించి అనే చిత్రంతో రేపు ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ట్రైల‌ర్‌, టీజ‌ర్స్‌ని బ‌ట్టి చూస్తుంటే ఈ మూవీ అడ‌ల్ట్ స్టోరీగా అభిమానుల‌ని అల‌రించేలా కనిపిస్తుంది. చూడాలి మ‌రి రేపటి సినిమాల‌లో ఏ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర భారీ విజ‌యం సాధిస్తుందో.

3629
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles