కౌశ‌ల్‌తో పాటు ఈ వారం నామినేష‌న్‌లో ఆ ముగ్గురు

Tue,September 4, 2018 08:30 AM
four members nominated for this week

బిగ్ బాస్ సీజ‌న్ 2 ఫైన‌ల్ స్టేజ్‌కి చేరుకుంది. మ‌రి కొద్ది రోజుల‌లోనే బిగ్ బాస్ సీజ‌న్ 2 టైటిల్ ఎవరు అందుకోనున్నారో తెలియ‌నుంది. గ‌త వారం బిగ్ బాస్ హౌజ్‌లో డ‌బుల్ ఎలిమినేష‌న్ ప్రక్రియ జ‌ర‌గ‌గా ఇంటి నుండి గణేష్‌,నూత‌న్ నాయుడు బ‌య‌ట‌కి వెళ్ళారు. ప్ర‌స్తుతం ఇంట్లో ఎనిమిది మంది స‌భ్యులు మాత్ర‌మే ఉండ‌గా, వారిలో ఈ వారం ఎలిమినేష‌న్‌కి న‌లుగురు నామినేట్ అయ్యారు. అయితే సోమ‌వారం నాటి ఎపిసోడ్ 86లో ఇంటిస‌భ్యుల‌కి బిగ్ బాస్ ‘లవ్ హేట్ టాస్క్’ ఇవ్వ‌గా , ఒక్కొక్క‌రు తాము ప్రేమించే వ్య‌క్తితో పాటు ద్వేషించే వ్య‌క్తి పేర్లు చెప్పుకొచ్చారు. అందుకు కార‌ణాలు కూడా తెలియ‌జేశారు.

ముందుగా గీతా మాధురి టాస్క్‌ని మొద‌లు పెట్టగా తాను గీతాని ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డుతున్న‌ట్టు తెలిపింది. సామ్రాట్‌ని హేట్ చేస్తున్న‌ట్టు పేర్కొంది. 60 రోజుల తరువాతే మీలో ఉన్న కిడ్ నాకు కనిపించారు. ఒకవేళ ఆలోపు మీరో నేనో ఎలిమినేట్ అయ్యిఉంటే మీ గురించి నాకు తెలిసుండేది కాదు. 60 డేస్ వేస్ట్ చేశా.. అందుకే మిమ్మల్ని ద్వేషిస్తున్నా అంటూ చెప్పుకొచ్చింది గీతా మాధురి. ఇక అమిత్.. తాను ప్రేమించే వ్యక్తి రోల్ రైడా కాగా ద్వేషించే వ్యక్తి కౌశల్ అని అన్నాడు. త‌నీష్ .. ప్రేమించే వ్యక్తి సామ్రాట్, ద్వేషించే వ్యక్తి కౌశల్. శ్యామల.. ప్రేమించే వ్యక్తి గీతా మాధురి, ద్వేషించే వ్యక్తి తనీష్. సామ్రాట్.. ప్రేమించే వ్యక్తి తనీష్, ద్వేషించే వ్యక్తి గీతా మాధురి. రోల్ రైడా.. ప్రేమించే వ్యక్తి అమిత్, ద్వేషించే వ్యక్తి తనీష్.

బిగ్ బాస్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ కౌశ‌ల్ .. తాను ప్రేమించే వ్యక్తి గీతా మాధురి అని చెప్పుకొచ్చాడు. . నేను మిమ్మల్ని ఎందుకు ప్రేమిస్తా అంటే.. నాకు 15 ఏళ్లుగా తెలుసు.. మీ కంటే నాకు హౌస్‌లో తెలిసిన వాళ్లు ఎవరూ లేరు. మీ ప్రవర్తన, మీ అమాయకత్వం, మీ తింగరితనం వీట‌న్నింటిని బ‌ట్టి మీరే నాకు ఇష్టం. రెండు మూడు వారాలుగా మీరు నా మీద ఉన్న‌ది లేన్న‌ట్టు చెబుతున్న కార‌ణంగా నేను ఎక్కువ ద్వేషించేది కూడా మిమ్మల్నే అంటూ బాంబ్ పేల్చారు కౌశల్. ఇక ఈ వారం నామినేష‌న్ ప్ర‌క్రియ‌లో భాగంగా బిగ్ బాస్ గార్డెన్ ఏరియాలో ఉన్న బోర్డ్‌పై నామినేట్ చేసే ముగ్గురు వ్య‌క్తుల ఫోటోల‌తో పాటు ఎవ‌రినైతే సేవ్ చేయాల‌నుకుంటున్నారో, వారి ఫోటో కూడా అంటించాలని కోరారు. మ‌ర్డ‌ర్ టాస్క్‌లో భాగంగా ఈ సీజ‌న్ మొత్తం ఎలిమినేట్ అయిన కౌశ‌ల్‌ని ఎవ‌రిని నామినేట్ చేయోద్ద‌ని చెప్పిన బిగ్ బాస్‌, సీక్రెట్ టాస్క్ స‌క్సెస్ ఫుల్‌గా పూర్తి చేసినందుకు గీతా మాధురికి ఈ వారం మిన‌హాయింపు ఇచ్చారు. తనీష్, రోల్ రైడాలకు కూడా ఈ ఎలిమినేషన్‌లో మినహాయింపు లభించింది.

ఈవారం ఎలిమినేషన్స్ కోసం ముందుగా కౌశల్.. అమిత్, శ్యామల, దీప్తి నల్లమోతు..లను ఎలిమినేషన్‌కి నామినేట్ చేసి సామ్రాట్‌ని సేవ్ చేశారు. అందుకు కార‌ణం కూడా వివ‌రించాడు. ఇక ఆ త‌ర్వాత గీతా మాధురి.. అమిత్, సామ్రాట్, శ్యామల., దీప్తి నల్లమోతుని సేవ్ చేసింది. రోల్ రైడా.. దీప్తి నల్లమోతు, సామ్రాట్, శ్యామల ఎలిమినేట్ చేయగా.. అమిత్‌ని సేవ్ చేశారు. తనీష్.. అమిత్, గణేష్, శ్యామలలను ఎలిమినేట్ చేయగా.. సామ్రాట్‌ని సేవ్ చేశారు. శ్యామల.. దీప్తి నల్లమోతు, అమిత్, సామ్రాట్‌లను నామినేట్ చేశారు. దీప్తి నల్లమోతు... శ్యామల, అమిత్, సామ్రాట్‌లను నామినేట్ చేశారు. అమిత్.. దీప్తి, శ్యామల, సామ్రాట్‌లను నామినేట్ చేశారు. సామ్రాట్.. దీప్తి,శ్యామల, అమిత్ లను నామినేట్ చేశారు. ఈ నామినేషన్ ప్రక్రియలో ఎక్కువ మంది అమిత్, శ్యామల, దీప్తిలను నామినేట్ చేయడంతో ఈ వారం ఎలిమినేషన్‌లో కౌశల్‌తో పాటు ఈ ముగ్గురు నామినేషన్‌ను ఎదుర్కొనబోతున్నారు.

కౌశ‌ల్‌కి కౌశ‌ల్ ఆర్మీ తోడుగా ఉంది కాబ‌ట్టి ఆయ‌న ఎలాగు సేఫ్ జోన్‌లా ఉంటాడ‌ని అభిమానులు భావిస్తుండ‌గా ఈ వారం బిగ్ బాస్ హౌజ్ నుండి అమిత్‌, శ్యామ‌ల‌, దీప్తిల‌లో ఒక‌రు లేదా ఇద్ద‌రు బ‌య‌ట‌కి వెళ్ళ‌వచ్చంటూ ప్ర‌చారం జ‌రుగుతుంది. మ‌రి బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్‌ల‌తో ఆడియ‌న్స్ హృద‌యాన్ని ఎక్కువ‌గా ఎవ‌రు గెలిచి హౌజ్‌లో ఉంటారో, అలాగే త‌మ త‌ప్పిదాల వ‌ల‌న బిగ్ బాస్ హౌజ్ నుండి ఎవ‌రు వెళ్లిపోతారో తెలియాలంటే శ‌నివారం వ‌ర‌కు వేచి చూడాల్సిందే.

4424
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles