నాలుగు భాష‌లు.. ఒకే లొకేష‌న్‌.. ఒక‌టే సినిమా

Wed,November 1, 2017 02:35 PM
four heroines stayed at single place

బాలీవుడ్‌లో సూప‌ర్ డూప‌ర్ హిట్ కొట్టిన క్వీన్ చిత్రం సౌత్‌లోని నాలుగు భాష‌ల‌లో రీమేక్ అవుతున్న‌ సంగ‌తి తెలిసిందే. హిందీలో కంగనా ర‌నౌత్ పోషించిన పాత్ర‌ని తెలుగులో త‌మ‌న్నా, త‌మిళంలో కాజ‌ల్‌, మ‌ల‌యాళంలో మంజిమా మోహ‌న్‌, క‌న్న‌డ‌లో ప‌రుల్ యాద‌వ్‌లు పోషిస్తున్నారు. నాలుగు భాష‌ల‌కి సంబంధించిన చిత్రీక‌ర‌ణ ఫ్రాన్స్‌లోని ఒకే ప్రాంతంలో జ‌రుగుతుంది. ఒకే లొకేష‌న్‌లో షూటింగ్ జ‌రుగుతుండ‌డంతో ఆ భామ‌లు కూడా హ్య‌పీగా ఫీల‌వుతున్నారు. ఇక బస కూడా వీరంద‌రికి ఒకే చోట ఏర్పాటు చేయ‌డంతో వారి ఆనందానికి అంతే లేదు. నలుగురు హీరోయిన్స్ ఒకేసారి షూటింగ్ చేయ‌డం చాలా అరుదు. ఇది విని చాలా హ్య‌పీగా ఫీల‌య్యాను. ఇలా అంద‌రికి ఒకే చోట బ‌స ఏర్పాటు చేసినందున మా మ‌ధ్య ఉన్న బాండింగ్ చాలా స్ట్రాంగ్ అవుతుంది అని అంటోంది త‌మ‌న్నా. ఇక ఒకే చోట నాలుగు భాష‌ల‌కి సంబంధించిన షూటింగ్ జ‌ర‌గ‌డంపై కాజ‌ల్ స్పందిస్తూ.. ఒకే సారి కెరీర్ స్టార్ట్ చేసిన మా అంద‌రి మ‌ధ్య చ‌క్క‌ని రిలేష‌న్ ఉంది. ఇండ‌స్ట్రీలోని నా బెస్ట్ ఫ్రెండ్స్‌లో త‌మన్నా ఒక‌రు. షూటింగ్ కోసం ఇలా అంద‌రం ఒకే చోట ఉండాల్సి రావ‌డం జ‌రుగుతోంది అని కాజ‌ల్ పేర్కొంది. నెల‌కు పైగా జ‌ర‌గ‌నున్న ఫ్రాన్స్ షెడ్యూల్‌లో మేమంద‌రం చాలా ఎంజాయ్ చేస్తామని చెబుతుంది మంజిమా మోహ‌న్‌. ఏదేమైన ఎప్పుడో ఈవెంట్స్‌లోనో లేదంటే ఏదైన అకేష‌న్‌లో కాని క‌లుసుకునే ఈ స్టార్స్ ఇప్పుడు షూటింగ్ కోసం ఏకంగా ఒకే చోట నెల రోజులు స్పెంట్ చేయ‌డం విశేష‌మే మ‌రి .

2058
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles