ఒకే ఫ్రేములో న‌లుగురు అందాల భామ‌లు

Sat,March 2, 2019 09:58 AM

ఈ మ‌ధ్య కాలంలో ఇటు హీరోలు, అటు హీరోయిన్‌లు గ్రూపులుగా క‌నిపిస్తూ అభిమానుల ఆనందాన్ని ప‌తాక స్థాయికి తీసుకెళుతున్నారు. మ‌హేష్‌, ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ .. ఈ త్ర‌యం ఇటీవ‌లి కాలంలో సోష‌ల్ మీడియాని షేక్ చేసింది. ప‌లు ఈవెంట్స్‌లో ముగ్గురు క‌లిసిక‌ట్టుగా క‌నిపించ‌డంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అయ్యారు. ఇక తాజాగా అంద‌మైన భామ‌లు ర‌కుల్ ప్రీత్ సింగ్‌, స‌మంత‌, త‌మ‌న్నా, కాజ‌ల్ అగ‌ర్వాల్ ఒకే ఫ్రేములో క‌నిపించారు. ఈ పిక్ చూసిన అభిమానులు క‌ళ్ళు తిప్పుకోలేక‌పోతున్నారు. తాజాగా ఈ నలుగురు భామ‌లు ‘కెప్టెన్‌ మార్వెల్‌’ సినిమా ప్రచార కార్య‌క్ర‌మంలో భాగంగా చెన్నైలో సంద‌డి చేశారు. ఇష్ట‌మైన కామిక్ పాత్ర‌ల గురించి చెబుతూ అభిమానుల‌ని ఆనందింప చేశారు. అంతేకాదు చిత్రంలోని పాత్ర‌ల‌లో మ‌న తెలుగు హీరోలు ఎవ‌రైతే బాగుంటార‌ని కూడా చెప్పారు.


మార్వెల్ సంస్థ నిర్మాణంలో కెరోల్‌ డేన్వర్స్‌ ఆధారంగా రూపొందిన అమెరికన్‌ సూపర్‌హీరో చిత్రం ‘కెప్టెన్‌ మార్వెల్‌’. బ్రీ లార్సెన్‌ ప్రధాన పాత్ర పోషించింది. మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా హర్‌ ఇన్‌ ఎవ్రీ హీరో... పేరుతో చెన్నైలో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. అందులోనే ఈ న‌లుగురు నాయికలు క‌లిసి సందడి చేశారు. కాజ‌ల్‌, ర‌కుల్‌, త‌మ‌న్నాని క‌ల‌వ‌డం చాలా సంతోషంగా ఉంద‌ని స‌మంతా అన్నారు. కాజ‌ల్ కూడా త‌న కో ఆర్టిస్ట్‌ని ఇలా క‌లిసినందుకు ఆనందంగా ఉంద‌ని ట్వీట్ ద్వారా తెలిపింది.2336
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles