బిగ్‌బాస్ హౌజ్‌లోకి కొత్త వ్య‌క్తి.. సందేహాలు తీర్చుకున్న‌ హౌజ్‌మేట్స్‌

Thu,September 27, 2018 08:34 AM
Fortune Teller Visits the House and clarifies the doubts

బిగ్ బాస్ సీజ‌న్ 2 కార్య‌క్ర‌మానికి మ‌రో నాలుగు రోజుల‌లో శుభం కార్డ్ ప‌డ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఇంట్లో స‌భ్యుల‌తో పాటు బ‌య‌టి వ్య‌క్తులు కూడా బిగ్ బాస్ విన్న‌ర్ ఎవ‌రో తెలుసుకోవాల‌ని చాలా ఉత్సుక‌త‌తో ఉన్నారు. ఈ వారంతో హౌజ్‌మేట్స్ బిగ్ బాస్ హౌజ్‌ని వీడ‌నుండ‌డంతో వారు తీపి జ్ఞాప‌కాల‌ని నెమ‌ర‌వేసుకుంటున్నారు. ఇక బుధ‌వారం జ‌రిగిన 109 ఎపిసోడ్ హైలైట్స్ విష‌యానికి వ‌స్తే బిగ్ బాస్ ఇంటి స‌భ్యుల‌కి ఓ టాస్క్ ఇచ్చారు. తాను ఇచ్చిన ప్ర‌త్యేక‌ టీ ష‌ర్ట్స్‌పై ఒక‌రిపై ఒకరికి ఉన్న అభిప్రాయాల‌ని రాయాల‌ని బిగ్ బాస్ అన్నారు. దీంతో సామ్రాట్‌... గీత త‌న‌కు అమ్మ‌లాంటిద‌ని రాశాడు. ఇందుకు గీతా .. సామ్రాట్ కొడుకు మాత్ర‌మే కాదు తండ్రి, సోద‌రుడు లాంటి వాడ‌ని రాశాడు.

ఇక కౌశ‌ల్‌.. త‌నీష్ టీ షర్ట్‌పై ‘‘ప్రేమ పూజారీ.. నీ ప్రేమను మాకూ పంచు’’ అని రాశాడు. ‘‘మీరు మీ కుంటుంబానికి, మీ సైన్యానికి ఎల్లవేళలా తోడుగా ఉండాలి’’ అని త‌నీష్‌.. కౌశల్ టీష‌ర్ట్‌పై రాశాడు. అలానే మిగ‌తా వారు కూడా త‌మ గుడ్ విష్‌ని తెలియ‌జేశారు. ఆ త‌ర్వాత కౌశ‌ల్ త‌న పొడుపు క‌థ‌ల‌తో అంద‌రిని న‌వ్వించాడు. ముందు 64, వెనుక ఒకటే.. ఏమిటో చెప్పుకోండని కౌశల్ అడిగాడు. అయితే, ఎవరూ సమాధానం చెప్పలేకపోయారు. దీంతో కౌశల్ ‘షార్క్’ అని చెప్పాడు. అదెలా అని దీప్తి అడిగిన ప్రశ్నకు.. ‘‘ముందు షార్క్‌కు ముందు 64 పళ్లు ఉంటాయి. వెనుక తోక ఉంటుంది’’ అని కౌశల్ సమాధానం చెప్పాడు.

‘చూపుకు తెల్ల తలకి బహుబల్ల’ అని అడిగిన పొడుపు కథకు సామ్రాట్ ఠ‌క్కున‌ సమాధానం చెప్పాడు. తెల్లగా ఉండేవి ఏనుగు దంతాలని, బహుబల్ల అంటే పెద్ద తలగదని తెలిపాడు. ఆ తర్వాత కూడా ప‌లు పొడుపు క‌థ‌లు వేయ‌గా వాటికి ఇంటి స‌భ్యులు ప‌గ‌ల‌బ‌డి న‌వ్వారు. ఇలా వారి మ‌ధ్య స‌ర‌దా సంభాష‌ణ‌లు జ‌రుగుతున్న క్ర‌మంలో బిగ్ బాస్ ఓ ఎనౌన్స్‌మెంట్ చేశారు. ఇంట్లోకి ఓ ప్ర‌త్యేక‌మైన వ్యక్తి ( జ్యోతిష్కురాలు ) రాబోతున్నార‌ని వారిని అడిగి మీ అనుమానాల‌ని నివృత్తి చేసుకోవ‌చ్చని తెలియ‌జేశారు. దీంతో యాక్టివిటి ఏరియాలోకి వెళ్లి ఒక్కొక్క‌రు త‌మ సందేహాల‌తో పాటు భ‌విష్య‌త్ కూడా తెలుసుకున్నారు.

ముందుగా సామ్రాట్‌కి ఆ అవ‌కాశం రావ‌డంతో యాక్టివిటి రూంలోకి వెళ్లిన తాను జ్యోతిష్కురాల‌ని బయట ఉన్న నా సమస్యలు, పరిష్కారం అవుతాయా? టాప్‌లో ఉంటానా? నాపై పాజిటివ్ అభిప్రాయం ఉందా? అని అడిగాడు. దీనికి
జ్యోతిష్కురాలు మీకు హౌస్‌లో అంతా పాజిటివ్‌గా ఉంది. బయట మీకున్న సమస్యలన్నీ నూరు శాతం నెర‌వేరుతాయి. మీలో నెగిటివిటీ కనిపించడం లేదు అని తెలిపారు. ఇక ఆ త‌ర్వాత గీత .. బయట అంతా పాజిటివ్‌గా ఉందా? నాకు నా భర్తకు మధ్య బంధం ఎలా ఉంది? అని అడిగింది. ఇందుకు జ్యోతిష్కురాలు .. బయట తప్పకుండా డిఫరెంట్‌గా ఉంటుంది. హౌస్‌లో ఉన్నట్లు లేదు. మీ భర్తతో మీ బంధానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు అని తెలిపారు.

కౌశ‌ల్ తాను బిగ్‌బాస్ టైటిల్ గెలిచి తీసుకెళ్తానా, టాప్ 2లో అయిన ఉంటానా అని అడిగాను. ఇందుకు జ్యోతిష్కురాలు మీరు చాలా హార్డ్ వ‌ర్క్ చేసే టైపు . బ‌య‌ట మీపై చాలా పాజిటివ్‌గా ఉంది. టాప్ 2లో త‌ప్ప‌కుండా ఉంటారని తెలిపింది.
ఇక త‌నీష్‌ ఈ గేమ్ తర్వాత నా లైఫ్ ఎలా ఉంటుంది? జనాలు నా గురించి ఎలా ఫీలవ్వుతున్నారు? అని అడ‌గ‌గా, జ్యోతిష్కురాలు.. బిగ్‌బాస్ తర్వాత మీకు బాగుంటుంది. మీ ఫ్యామిలీ లైఫ్ కూడా చాలా బాగుంటుంది. ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్తారు. ప్రజలు, సమాజం కోసం ఏమైనా చేయాలనే తపన మీలో కనిపిస్తోంది. ప్రజలకు కూడా మీ గురించి పాజిటివ్‌గా ఆలోచిస్తున్నారు. మీకు చాలా సపోర్ట్ ఉంది అని అన్నారు. చివ‌రిగా దీప్తి బయట నాకు వస్తున్న సపోర్ట్ ఎలా ఉంది? ఎంత పాజిటివ్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? అని అడిగింది. ఇందుకు జ్యోతిష్కురాలు.. చాలా బాగుంది చాలా పాజిటివ్‌గా ఉంది. ఎనర్జిటిక్‌గా ఉన్నారు. అదే మీకు పాజిటివ్ అని స్ప‌ష్టం చేశారు. ఆ త‌ర్వాత ఇంటి స‌భ్యులు ఎవ‌రి ప‌నుల‌లో వారు బిజీ కాగా 109వ ఎపిసోడ్ ముగిసింది.

5617
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles