కమల్ హాస‌న్‌ దర్శకత్వంలో తొలిసారి..

Tue,July 16, 2019 09:45 AM
For the first time, AR Rahman Kamal Haasan team up for big budget movie

ఇద్ద‌రు లెజండ‌రీలు ఒక సినిమా కోసం పని చేస్తే ఆ సినిమాపై ఎంత పెద్ద ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉంటాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌నక్క‌ర్లేదు. త‌మిళ స్టార్ హీరో క‌మ‌ల్ హాస‌న్‌, ఆస్కార్ అవార్డ్ విన్న‌ర్ ఏ ఆర్ రెహ‌మాన్ గ‌తంలో ప‌లు ప్రాజెక్ట్ ల‌ కోసం క‌లిసి ప‌ని చేశారు. కాని తొలిసారి క‌మ‌ల్ ద‌ర్శక‌త్వంలో తెర‌కెక్క‌నున్న ప్రాజెక్ట్ కి రెహ‌మాన్ సంగీతం అందించ‌బోతున్నాడు. ఈ విష‌యాన్ని ఏఆర్ రెహ‌మాన్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశాడు. క‌మ‌ల్‌తో క‌లిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ... లెజండ‌రీ న‌టుడు క‌మ‌ల్ హాస‌న్, లైకా ప్రొడ‌క్ష‌న్ సంస్థ‌తో క‌లిసి పని చేయ‌డం చాలా ఆనందాన్ని ఇస్తుంద‌ని పేర్కొన్నాడు.

క‌మ‌ల్ క‌ల‌ల ప్రాజెక్ట్ త‌లైవ‌న్ ఇరుక్కిర‌న్. ఈ చిత్రాన్ని 2015లో రీమేక్ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించాడు. కాని మ‌ధ్య‌లో ఆ ప్రాజెక్ట్‌కి సంబంధించి ఎలాంటి ఊసే లేదు. తాజాగా ఈ థ్రిల్ల‌ర్ చిత్రాన్ని క‌మ‌ల్ స్వీయ ద‌ర్శ‌క నిర్మాణంలో చేయ‌బోతున్నట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్‌ని రాజ్ క‌మ‌ల్ ఇంట‌ర్నేన‌ల్‌, లైకా ప్రొడ‌క్ష‌న్స్ సంయుక్తంగా నిర్మించ‌నున్నాయి. భారీ బ‌డ్జెట్ చిత్రంగా తెర‌కెక్క‌నున్న ఈ చిత్రానికి సంబంధించి పూర్తి క్లారిటీ రావ‌ల‌సి ఉంది. క‌మ‌ల్ ప్ర‌స్తుతం ఇండియ‌న్ 2 చిత్రంతో బిజీగా ఉన్నాడు. క‌మ‌ల్ - రెహమాన్ కాంబో 2000వ సంవ‌త్స‌రంలో రూపొందిన తెనాలి సినిమా కోసం ప‌ని చేశారు. మ‌ళ్లీ 19 ఏళ్ళ త‌ర్వాత వారి కాంబినేష‌న్‌లో సినిమా వ‌స్తుండ‌డంపై అభిమానుల‌లో ఎక్స్‌పెక్టేష‌న్స్ పెరిగాయి.1368
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles