వైరల్‌గా మారిన దీప్‌వీర్ వెడ్డింగ్ ఫోటోలు

Sun,November 18, 2018 09:30 AM
For Deepika Padukone And Ranveer Singh,  Wishes Pour In From Her Team

బాలీవుడ్ ప్రేమ జంట దీపికా ప‌దుకొణే, ర‌ణ్‌వీర్ సింగ్‌లు ఈ నెల 14న కొంక‌ణీ సంప్ర‌దాయం ప్ర‌కారం, 15న సింధీ ప‌ద్ద‌తిలో వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఇట‌లీలో డెస్టినేష‌న్ వెడ్డింగ్ జ‌రుపుకున్న వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోల కోసం అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తుండ‌గా, ర‌ణ్‌వీర్ ఇటీవ‌ల రెండు ఫోటోలు విడుద‌ల చేశారు. వాటిని చూసి అభిమానులు తెగ మురిసిపోయారు. నేడు నూత‌న జంట ఇండియాకి తిరిగి రానుండ‌గా ఈ నెల 21న బెంగళూరులో, 28న ముంబయిలో వివాహ విందును ఏర్పాటు చేయనున్నారు. అయితే వివాహ వేదిక స్థ‌లంలో జ‌రిగిన వేడుక‌ల‌కి సంబంధించిన‌ ఒక్క ఫోటో కూడా బ‌య‌ట‌కి రాకుండా ప‌క‌డ్భందీ ఏర్పాట్లు చేయ‌గా, దీప్‌వీర్‌ జంటకు స‌న్నిహితులుగా ఉన్న‌వారి ద్వారా కొన్ని ఫోటోలు నెట్‌లో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

దీపికా ప‌దుకొణే స్టైలిస్ట్ ష‌లీనా న‌తానీ మ‌రియు ఆమె పర్స‌న‌ల్ ట్రైట‌ర్ న‌మ్ లు కొంక‌ణీ సంప్ర‌దాయం ప్ర‌కారం జ‌రిగిన పెళ్లికి సంబంధించిన ఫోటోల‌ని త‌మ పేజ్‌లో పోస్ట్ చేశారు. నూత‌న జంట‌కి శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ రానున్న రోజుల‌ని స‌రదాగా గ‌డ‌పండి అనే కామెంట్ పెట్టారు. ఇక ప్రముఖ డిజైనర్‌ సవ్యసాచి, కాస్టింగ్‌ డైరెక్టర్‌ షానూ శర్మ కూడా వీరికి సంబంధించిన ఫొటోలను సామాజిక మాధ్యమాల వేదికగా షేర్‌ చేశారు. హల్దీ వేడుకకు సంబంధించిన ఫొటోను షానూ పంచుకోగా.. ‘చూడా’ వేడుక ఫొటోలను సవ్యసాచి షేర్‌ చేశారు. ఎరుపు, తెలుపు రంగులో ఉన్న గాజులను వధువు ధరించడమే ఈ ‘చూడా’ వేడుకలోని ప్రత్యేకత. ఈ రెండూ పెళ్లికి ముందు జరిగే తంతులే. వివాహానికి ముందు లేక్‌కోమోలో వీటిని నిర్వహించారు. వెడ్డింగ్ ప్లాన‌ర్ వంద‌న మోహ‌న్ కూడా నూత‌న దంప‌తుల‌కి సంబంధించిన ఫోటోల‌ని షేర్ చేశారు. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్న దీప్ వీర్ ఫోటోలు అభిమానుల ఆనందాన్ని రెట్టింపు చేస్తున్నాయి.

1466
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles