సినిమాలు పైరసీ..ఐదుగురు అరెస్ట్

Thu,December 13, 2018 05:34 PM
Five persons arrested for run movie piracy ring

లాస్ ఏంజెల్స్: విడుదలకు ముందే సినిమాలను పైరసీ చేస్తున్న అంతర్జాతీయ ముఠాను అమెరికా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో ఇద్దరు భారతీయులు ఆదిత్యారాజ్, జితేశ్ జాదవ్ ఉన్నారు. నిందితులు ఓ హాలీవుడ్ నిర్మాణ సంస్థ సాయంతో విడుదలకు ముందే పలు భారీ బడ్జెట్ చిత్రాలు, టెలివిజన్ షోలను పైరసీ చేసి అమ్మకాలు చేస్తున్నారు.

సదరు హాలీవుడ్ నిర్మాణ సంస్థకు చెందిన కంప్యూటర్ సిస్టమ్స్ సాయంతో సినిమాలు, సినిమా ట్రైలర్లు, టీవీ సిరీస్‌లకు సంబంధించిన డిజిటల్ పైల్స్‌ను హ్యాకింగ్ చేస్తున్నట్లు పోలీస్ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. నిందితులు సుమారు 25వేలకుపైగా సినిమాలకు సంబంధించిన పైల్స్‌ను హ్యాక్ చేసి ప్రాన్స్‌లో ఉన్న సర్వర్‌కు అప్‌లోడ్ చేస్తున్నట్లు తెలిపారు. హ్యాక్ కు గురైన చిత్రాల జాబితాలో గాడ్జిల్లా, హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ 2, హార్రిబుల్ బాసెస్ 2 ఉన్నట్లు చెప్పారు. మోషన్‌పిక్చర్ అసోసియేషన్ ఆఫ్ అమెరికా అనుబంధంగా నడుస్తున్న కొన్ని కంపెనీలకు రహస్యంగా ఈ చిత్రాలను అమ్ముతున్నట్లు గుర్తించినట్లు యూఎస్ అటార్నీ కార్యాలయం ఉన్నతాధికారి మాలిక్ ఫరూఖ్ చెప్పారు. మలేషియాకు చెందిన గోబిరాజా సెల్వరాజా అనే వ్యక్తి పేపాల్ ఖాతా ద్వారా లావాదేవీలు జరుగుతుండగా..దుబాయ్‌కు చెందిన సామ్ నాన్స్ సర్వర్ మెయింటేనెన్స్ చూస్తున్నట్లు వెల్లడించారు.

2546
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles