ఈ ఫ్రైడే రోజు ఫుల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌

Tue,December 18, 2018 01:04 PM
five movies big fight on box office

శుక్ర‌వారం వ‌చ్చిందంటే సినీ ల‌వ‌ర్స్‌కి పండ‌గే అని చెప్ప‌వ‌చ్చు. ప్ర‌తి వారం ప‌లు చిత్రాలు ప్రేక్ష‌కుల ముందుకి రానుండ‌గా, ఈ వారం ఐదు చిత్రాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పోటీ ప‌డ‌నున్నాయి. ఇందులో మూడు డ‌బ్బింగ్ చిత్రాలు ఉండ‌డం విశేషం. టాలీవుడ్ నుండి ప‌డి ప‌డి లేచె మ‌న‌సు, అంత‌రిక్షం చిత్రాలు విడుద‌ల కానుండ‌గా, ఈ రెండింటిపై అభిమానుల‌లో భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉన్నాయి. ఇక క‌న్న‌డ న‌టుడు య‌శ్ ప్ర‌ధాన పాత్ర‌లో తెరకెక్కిన కెజియ‌ఫ్ చిత్రం కూడా ఈ నెల 21న విడుద‌ల కానుంది. ఈ చిత్ర ట్రైల‌ర్ సినిమాపై భారీ ఆస‌క్తిని క‌లిగించింది. ఇక షారూఖ్, అనుష్క శ‌ర్మ‌,క‌త్రినా కైఫ్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన జీరో చిత్రం శుక్ర‌వారం ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇందులో స‌ల్మాన్‌, శ్రీదేవితో పాటు ప‌లువురు స్టార్స్ కీల‌క పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నారు. షారూఖ్ మ‌రుగుజ్జుగా క‌నిపించ‌నున్న ఈ చిత్రంపై కూడా అభిమానుల‌లో భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉన్నాయి. మారికి సీక్వెల్‌గా తెర‌కెక్కిన మారి 2 చిత్రం కూడా ఈ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించ‌నుంది. ధ‌నుష్‌, సాయిప‌ల్లవి ప్ర‌ధాన పాత్ర‌లో రూపొందిన ఈ చిత్రం త‌ప్ప‌క విజ‌యం సాధిస్తుంద‌నే భావ‌న‌లో టీం ఉంది. మొత్తానికి ఐదు చిత్రాల‌పై భారీ అంచ‌నాలే ఉండ‌గా ఇందులో ఏ చిత్రం బాక్సాఫీస్‌ని షేక్ చేస్తుందో చూడాలి.

2362
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles